Friday, 3 July 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (36వ సర్గ)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
      శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:



 36వ సర్గ (వాల్మికి రామాయణములోని 47 శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు సీతకు రాము ముద్రికను ఇచ్చుట, రాముడు నన్నీ  దు:ఖ సముద్రమునుండి ఎప్పుడు ఉద్దరించునని ఆత్రుతతో సీత ప్రశ్నిమ్చుట, రామునకు ఆమెపై  ప్రేమను వర్ణించి చెప్పి హనుమంతుడు ఆమెను ఓదార్చెను ")



మహాతేజశాలి, వాయుపుత్రుడైన హనుమంతుడు సీతకు నమ్మకమును
కల్గించుటకై మరల వినయ పూర్వకముగా నెమ్మదిగా వచించెను 
ఓ మహాభాగ్యవంతురాలా, నేను బుద్దిశాలియైన రామచంద్రుని దూతను 
ఒదేవి రాముని పేరు గుర్తు వున్న ఉంగరమును చూడమని ఇచ్చెను 


మహాత్ముడైన రాముడు ఇచ్చిన ఉంగరమును 
నీనమ్మకమునకై తీసుకొనివచ్చి చూపినాను 
నీవు ఊరటకలిగి ఉండుము మంగళము కలుగును
నీ దు:ఖము తొలగిపోవు సమయము వచ్చెను 


ఆ జానకీ భర్తయొక్క కరవిభూషితమైన అంగులీకమును
చూచి భర్త సంప్రాప్త మైనట్లు గానె ఆనందించెను 
సుందరమైన నేత్రములు ఆనందముతో నిండి పోయెను 
ముఖము రాహువు విడిచిన చంద్రుడి వలె ఉండెను


సీత భర్త పంపిన సందేశమును చూచి సంతో షించెను 
సిగ్గు కలది ప్రియ వాక్యములతో మారుతితో పల్కెను
మిక్కిలి ఆదరముచెసి అమహాకపిని మిక్కిలి ప్రసంసించెను 
ఆనంద పారవశ్యముతో రాముడు పంపిన వానరునితో పల్కెను 


ఓ వానర శ్రేష్టుడా నీవు మిక్కిలి పరాక్రమ వంతుడవును  
సమర్దుడవును,ప్రాజ్నుడవును,నీవు ఒంటరిగానే ఈ రాక్షసస్థానమును 
ఆక్రమించితివి, శతయోజన విస్తీర్ణమును, మకరాలయమును 
అగు సముద్రమును ఆవుపాదమువంటి దానిగా చేసి అవలీలగా వచ్చినావును 


ఓ కపివారా నిన్ను నేను సాధారణ వానరుడిగా యనుకొనను
నీకు రావణుడనిన భయము కాని, తొట్రు పాటుగాని లేకుండెను
నీవు నాతో సంభాషించుటకు తగిన వాడవును విదితాత్ముడవును 
నిన్ను పరీక్షించకుండగా, నీ పరాక్రమము తెలుసుకొని  రాముడు నాదగ్గరకు పంపెను


సత్య ప్రతిజ్నుడును  ధర్మాత్ముడును అగు రామ చంద్రుడును

మహాతేజశ్వియును సుమిత్రానంద వర్ధనుడును అగు లలక్ష్మణుడును
ఇరువురు దైవయోగమున కుశలముకదా? నా భాగ్యవశముచేత  అనుకొందును
ఆ రాముడు నాకొరకు  సముద్రము వరకు ఉన్న భూమిని ఏల కాల్చ  కుండెను   


లేదా అది వారి లోపమని చెప్పుటకు వీలు లేదును 
ఆ రామలక్ష్మణులు దేవతలను కూడా నిగ్రహించే సమర్దులును
కాని నా దు:ఖముచేత వారి గొప్పను చెప్పుకొని జీవిస్తున్నాను 
రాముడు మనస్సులో భాద పడుట లేదుకదా అని అడుగుతున్నాను 


చేయుచున్నాడా? తను ముందు ముందు చేయవలసిన పనులను 
భ్రాంతిలేకుండా ఉన్నాడా? ప్రతి ఒక్కరిని సమానముగా గౌరవించుట లోను
ప్రయోగించు చున్నాడా? మిత్రుల విషయమున సామ దానోపాయ ములను 
అమిత్రుల విషయమున దాన భేద దండ రూపమైన త్రివిదోపాయమును


సంగ్రహించు చున్నాడా? శ్రీరాముడు ప్రయత్న పూర్వకముగా  మిత్రులను
అతని వద్దకు వస్తున్నారా? ప్రియాతి ప్రిఅయ మిత్రులెవరైనను 
అతనిని సంమానిన్తురా? కళ్యాణ కారులగు మిత్రులును 
ఆశించు చున్నాడా? దేవతలా యొక్క అనుగ్రహమును


సేవించు చున్నాడా? పురుషాకారానికి  దైవానికి సమానమైన ప్రాధాన్యతను 
నామీద పరమ తగ్గలేదు కదా? నేను దగ్గర లేకపోవుట వలనను
నన్ను విడిపించు నందువా? ఈ కష్టములనుండి అంతయును 
దు:ఖములకు అలవాటు పడినాడా? నా రాముడు సుఖములనుభ విమ్ప దగినవాడును


క్రుంగి పోవుటలేదు కదా ? తోడులేని కష్టమును తలచు కుంటూను 
వార్తలు వచ్చు చున్నవా? కౌసల్యా,సుమిత్రా, భరతులయోక్క క్క్షేమ సమాచారములను
కోపముతోభాదపడుచున్నడా? నా నిమిత్తమై కలిగిన ఎడబాటునకును 
అనయ్మనస్కుడుగా నున్డుతలేడుకడా? నన్నే తలచుకుంటూ విరహభాదతోను


పంపునా ? సోదరునియందు ప్రీమగల భరతుడు ఈ నిమిత్తమై మంత్రులను 
పంపునా అక్షౌహిని ప్రమాణముగల భయంకరమైన సైన్యమును  
రాగాలుగునా? వానరాదిపతియగు సుగ్రీవుడు దంత నఖాయుదులైన కపివరులను
సంహరించునా? అస్త్రకోవిదుడును అగు లక్ష్మనుడు తనశరజాలముచె ఎదుర్కోనగలుగునా రాక్షసులను
 



చూడగలనందువా ? శ్రీ రామచంద్రుని యొక్క రౌద్రరూపమును 
భయంకరమైన అస్త్రములచె యుద్ధమున ప్రయోగించుటను 
రావణుని మిత్ర సహితముగా శ్రీరాముడు హతమార్చుటను
తెలుసుకొందునా హనుమా? వివరముగా తెలుప వలెను 


బంగారుముతో సమాన మైన వర్ణము కగియును 
పద్మములతో సమానమైన రాముని ముఖపద్మమును 
ఎండ వలన నీరు ఇంకిపోగా సోషించిన పద్మమువలెను
నాయొక్క వియోగమున సోకముచే దీనమై ఉండేనను కొందును 


పితృవాక్య పాలన రూప ధర్మోపదేశము వలన రాజ్యమును
విడిచి నన్ను కాలినడకన అరణ్యమునకు తీసుకెల్లునప్పుడును
మనోవ్యధకాని, భయముకాని. శోకముకాని,కలుగలేదును
అట్టి రాముడు ఇప్పుడు ధైర్యముగా నాకొరకు ఎలా ఉండెను


నేను రాముని ప్రవృత్తిని వినిన పిమ్మటే జీవించాలని అనుకుంటున్నాను ఆ సీతాదేవి ఈ  విధముగా మహార్ధయుక్తమగు వచనమును పలికెను  
 హనుమంతునివలన రామ విషయకమైన అభిరామమైన వచనమును
వినుటకు సీతాదేవి తన ప్రసంగామును తత్కాలముగా విరమించెను 


భిమవిక్రముడగు పవనపుత్రుడైన మారుతి సీత పలుకులను 
విని శిరమున నంజలిబంధించి ఇట్లు బదులు పలికెను
ఓ సీతాదెవి నీవు ఇక్కడ ఉన్నట్లు రామునకు తెలియకపోవును 
దేవేంద్రుడి భార్యయైన సచీదేవిని తీసుకొని వెళ్ళినట్లు నిన్ను తీసుకొని వెల్లలేక పోయెను 


ఓ సీతా నా మాట వినిన వెంటనే రాముడు వానర గణములతోను
ఎలుగుబంట్లు గుంపులతోను నిండిన పెద్ద సైన్యముతో రాగాలుగును
ఆ రామచంద్రుడు తన భానములచే అక్షోభ్యమైన సముద్రమును
సింహముచేత పీడించబడిన ఎనుగువలె సుఖము కోల్పోయి ఉండెను 


ఓ దేవి మందరపర్వతము పైనను మలయ పర్వతము పైనను
మేరు పర్వతము పైనను, విద్య,దుర్ధర పర్వతముల పైనను
అందలి ఫలమూలములపై మొదలగువానిపై ఒట్టు పెట్టుకొని చెప్పు చున్నాను   
నీవు ప్రస్రవణ పర్వతముపై ఉన్న రామున్నిసీఘ్రముగా చూడ గలవును

నీవు త్వరలోనే సుందరమైన నేత్రములు కలవియును 
మనోహరమైన దొండపండు వంటి పెదవులు కలవియును
ఓ వైదేహి ఐరావతము ఎక్కి నాసీనుడైన దేవెంద్రుని బోలిన రామ చంద్రుడును 
అందమైన కుండలములతో శోభించు దశరధ నందనుని చూడ గలవును 

రాఘవుడు మాంసమును తినుటలేదు, మధువును సేవించుట లేదును 
సాస్త్రవిహితమైన అరణ్యమునందు లభించు ఆహారమును 5వ జామున సేవించు చుండెను
తన శరీరముపై వాలిన దోమలను గాని, ఈగలును గాని తోలు కొన కుండెను 
శ్రీ రాముడు ఎల్లప్పుడూ నీయందె అంత రాత్మలగ్నమై యుండి విలపించు చుండెను 

శరీరము మీద కీటకములు వాలినను, పాములు ప్రాకినను 
తెలీయుటలేదు, అతడు నిత్యము నిన్నే ద్యానించు చుండెను
నీ యొక్క విరహమునకు గురిఅయి మరియొక విషయమేమీ అలోచిన్చ కుండా ఉండెను 
అతడెన్నడు నిద్రపోడు, నిత్యమూ నిన్ను గూర్చియె సోకించు చుండెను


ఏదైనా పండుగాని,పువ్వుగాని అందమైన మరి ఏదైనా వస్తువు కనబడినను
హాప్రియ అని నిన్ను అనేకవిధముల స్మరించుచు నిట్టుర్పు విడుచు చుండెను 
ఒదేవి వ్రతధారియును, మహాత్ముడునగు రాజకుమారుడను
నిత్యము పరితపించుచు ఓ సీత నిన్నే పొందుటకై యత్నిమ్చును


రామునకు ఏంత శోకము ఉండేనో సీతకు కుడా అంత శోకము ఉండెను
కాని రాముని గుణ వర్ణనను వినుటచే ఆమె శోకము కొంత తగ్గును
సరద్రుతువు నారంభమున సోషించి  మేఘచంచంద్రులతో  తోడి కొనినను 
రాత్రి పగదిగా నుండెను అనగా సుఖదు:ఖములకు లో నాయెను
శ్రీ సుందరా కాండ నందు 36 వ సర్గ సమాప్తము

No comments:

Post a Comment