Sunday, 26 July 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (41వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
      శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


 41వ సర్గ (వాల్మికి రామాయణములోని 21శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు ఉద్యాన వనమును ధ్వంసము చేయుట )



తిరిగి వెళ్ళుటకు సిద్ధముగా గా ఉన్న మారుతిని సీత మంచి మాటలతో ఆదరించెను
పిదప హనుమంతుడు కొంత దూరము వెళ్లి ఇట్లు ఆలోచించెను 
నేను చేయవలసిన పని ఇంకా ఉన్నది, సీతను చూచినాను, సీతా సందేసము విన్నాను 
ఇక ఇక్కడ సామ,దాన, భేదలను విడిచిపెట్టి దండో పాయమునె ప్రయోగించవలెను


సామో పాయము గుణ కారిగా ఉండదు రాక్షసుల విషయమునందును 
దానము కూడా ఉపయోగ పడదు ధనవంతుల విషయము నందును
భెదనీతి కూడా  పనిచేయదు బలదర్పముగల వారి విషయము నందును
నాకు ఒక్కటే సంజసమనిపించు చున్నది ప్రయోగించాలి బల పరాక్రమములను


ఈ పరిస్తితిలో నేను పరాక్రమమును చూపుట తప్ప వేరొక మార్గము లేదును 
యుద్దమునందు కొంత మంది వీరులను హతమార్చిన రాక్షసులు 
మెత్తబడును
ఏదైనా ఒక కార్యము చేయవలనని ఆజ్ఞాపించినప్పుడు దానికి విరోధము కలుగకుండగాను
ఇతరములైన అనేక కార్యములను కూడా ఎవరు సాదించునో అతడే సమర్దుడును 


ఒకే ఉపాయము వుండదు ఎంత చిన్న కార్యము నకైనను 
దానిని సాధించుటకు అనేక ఉపాయములు ఉండ వచ్చును 
ఒక కార్యమును సాధించుటకు అనేక ఉపాయములు ఎవరికీ తెలియునో 
అతడే అన్ని కార్యములు సాధించుటకు సమర్ధుడై యుండెను  


ఇక్కడ నేను శత్రుమర్ధన రహస్యములను నెరిగి జరగబోవు కార్యము నందును 
ఒక నిశ్చయమునకు వచ్చి ఆ తరువాత సుగ్రీవనగరమునకు వెల్లెదను
అప్పుడే నా ప్రభువు ఆజ్ఞను ఖచ్చితంగా నిర్వహించిన వాడినగుదును 
ఆరావణుడు నన్ను ఎట్లు గౌరవించ గలడొ ముందుగా తెలుసు 
కొనగలను 


నాయొక్క ఈ రాక సుఖప్రద మెట్లు కాగలుగును
 రాక్షసులలో కూడా హటాత్తుగా యుద్దము ఎట్లు సంభవించును 
రావణుని మంత్రులను, అనుచరులను, సైన్యమును 
ఎదుర్కొని అతనిమనస్సున ఎమిఉన్నదో తెలిసి కొనవలెను 


రావణుని మతమేమో బలమేమో తెలుసుకొని ఇక్కడ నుండి సుఖముగా తిరిగి వెల్లెదను
క్రూరుడైన రావణుని ఉత్తమమైన ఉద్యానవనము అనేక విధములైన వృక్షములతోను లతలతోను
ఉన్న వనము నెత్రములను, మనస్సును, ఆకర్షించు నందనవనము వలెఉండెను
అగుఈ అశోక వనమును ఎండిన అడవి అగ్ని కాల్చినట్లు నేను 
ధ్వంసము చేసెదను


ఈ వనము భస్మము కాగా రావణునికి నాపై కోపము రాగలుగును
అటుపిమ్మట రావణుడు,అశ్వములతోను ఏనుగులతోను రధములతోను
 ఆయుధములు ధరించిన పెద్దసేనను తీసుకొని నాపై రాగలుగును
అప్పుడు ఇక్కడగోప్ప భయంకరమైన యుద్దము జరుగ గలుగును


నేనుగూడ యుద్దమున ప్రచండ పరాక్రమము గల రాక్షసులను
డీ కొని భంగమోందని పరాక్రమముగల వాడనై ప్రవర్తించెదను
రావణుడు నాపైక పంపిన సేనను హతమార్చి ఇక్కడ నుండి సుఖముగా పోగలుగుతాను
హనుమంతుడు అలోచించి పరాక్రమముతో విజ్రుంభించాలని అనుకొనెను 


మారుతి వృక్షములను వాయువు విరిచినట్లు విరుచుట ప్రారంభించెను 
మారుతి పరాక్రమమునకు పక్షులు ధ్వనులు చేయుచు ఆకుల్లారాలు చుండెను 
వనములోని లతా గృహములను,చిత్రగృహములను నశిమ్పచేసెను
ఈ విధముగా లతలతోను, వృక్షములతోను నిండియున్న అశోక వనమును భాగ్నమోనర్చెను


ఆ ఉద్యానవనములో అనేకములైన పక్షులు అరుపులు ప్రారంభించెను 
అక్కడ చెరువులు తెగి వృక్షములు లతలు కలసి భయంకరంగా ఉండెను
 ఆధారముగా ఉన్న స్థంబములు చెట్లు అక్కడ అగ్నికి దహించినట్లుగా మారెను 
దుఖకాంతలైన స్త్రీలు పడినట్లుగా వనములోని చెట్లన్నీ పడిపోయెను 


మహాసర్పములను, ఇతర క్రూరమృగములను ఎగరగోట్టెను
రాతిగ్రుహములు ఇతరగ్రుహములు అరుగులు పగల గొట్టెను
అందువలన తనతొల్లిటి రూపమును కోల్పోయి పూర్తిగా నాశనమాయెను
రావణుని స్త్రీలకు ఆనందము కల్గించు ఉద్యానవనము నాశన మయ్యెను 


పేక్కు మంది మహాబలాడ్యులతో స్వచ్చందముగా ఒక్కడే యుద్దమును
 చేయుకోరికతో ఆమహావానరుడు జగత్పతియును మహాత్ముడును 
నగు రావణునియోక్క మనస్సునకు కష్టమును కల్గించు కార్యమును
చేసి అద్భుతమైన శోభతో వేలుగొందుచూ సింహద్వారముపై నుండెను

శ్రీ సుందరకాండము నందు 41వ సర్గ సమాప్తము

No comments:

Post a Comment