Monday, 13 July 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (38వ సర్గ)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
      శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
 38వ సర్గ (వాల్మికి రామాయణములోని 73 శ్లోకాల  తెలుగు వచస్సు)
("సీత హనుమంతునకు చిత్రకూటముపై జరిగిన కాకవృత్తాంతమును   గూర్చి చెప్పి, రామునకు నమ్మిక కలుగుటకై హనుమంతునకు చూడా మణి ని ఇచ్చుట ")


అటు  పిమ్మట ఆ కపి శ్రేష్టుడు సీత పాల్కులు విని సంతోషించెను 
మాటలలో నేర్పరి అయిన హనుమంతుడు ఆమె మాటలు విని ఇట్లనెను 
శుభదర్శనయగు ఓ దేవి ? నీ పాలకులు చాలా యుక్తి యుక్తముగను
అగు స్త్రీ ప్రకృతికి తగినదిగను పతివ్రతకు అనురూపముగా నుండెను


నీవు స్త్రీ వి గనుక నన్ను  అధిరోహించి శతయోజన విస్తారమగు కడలి దాటుటను
కష్టము నీవు చెప్పిన రెండవ కారణము రామునికంటే వేరైనా వాని సంస్పర్శను చేయను
అనునది కుడా మిక్కిలి యుక్తము శ్రీరామ చంద్రుని యొక్క భార్య వగు నీవట్లనుటను  
   నీకు మిక్కిలి తగియున్నది. ఓ దేవి నీవు తప్ప మరిఎవ్వరు ఇట్లు పలుక కలుగును?


ఓ దేవి నీవు ఏ  విధముగా ప్రవర్తించి నావో, నీయొక్క సమస్త  చేషితమును 
నా యెదుట నీవు మాటలాడిన అన్ని మాటలను సమ్పూర్ణముగా  తెలుపగలను 
ఓ సీతాదేవి అనేక కారణములు ఉండుటచేతను రామునకు ప్రియము చేయట వలనను 
ఇచ్ఛ చేతను, స్నేహముచేతను, నీ భాదను చూసి నామనసు కరిగి నేనట్లు చెప్పినాను


లంక ఎదిరింప శక్యము కానిది, మహాసముద్రము దాటుట చాలా కష్టమును 
నాకు నిన్ను తీసుకొని పోవుటకు తగిన సామర్ద్యము కూడా  ఉన్నదియును 
ఈ అన్నీ  కారణములు దృష్టిలో వుంచుకొని నేనట్లు చెప్పినాను 
మీ విషయమున స్నేహము చేతను, భక్తిచేతను, రామునివద్దకు చేర్చాలని కోరికతో పలికినాను 


ఓ దేవి నీవు నాతొ వచ్చుటకు ఇష్టము లేనిచో ఆనవాలుగా ఏదైనా ఇవ్వ వలెను 
సీత హనుమంతుని మాటలు విని కన్నీటితో కూర్చిన మాటలుగా ఇట్లు పలికెను 
నీవు నా భర్తఅయిన  రామునితో ఇక్కడ నీవు చూసిన దంతయు  చెప్పవలెను 
నీవు నేను చెప్పా బోవు అభిజ్ఞానము గూర్చి నా ప్రియునికి తెలుప వలెను 


చిత్ర కూటపర్వతము యొక్క ఈ సాన్యభాగమున మందాకిని కి
 సమీపమున
ఫలమూల ఉదక ప్రాచుర్యముగల సిద్ద సేవితమైన దేశముగల 
ఋష్యాశ్రమమున
నివశించినపుడు నానా పుష్ప సౌగంద్యములతో నిండిన గాలి ఉన్న ప్రాంతమున 
విహరించి నీటితో తడిసి నీవు నా వడిలో కూర్చోని పొందావు సుఖమును 


అటుపిమ్మట ఒక కాకి వచ్చి నన్ను ముక్కుతొ పొడవసాగెను
నేను ఆకాకిని రాయి ఎత్తి నివారించుటకు ప్రయత్నిమ్చినాను
కానీ ఆ కాకి నన్ను పోడుచుచు అక్కడనే దాగు కొను చుండెను 
బలులను భుజించు ఆకాకి నామంసము తినకోరి పొడుచు చుండెను 


నేను ఆ పక్షిపై కోపించి నమొలసూలను సరిచేయుచుండగా నా చీర జారెను 
ఆ చీరను సరిచేసుకోను చుండగా నీవు చూసి నన్ను పరిహాసము చేసి నావును
ఆ కాకి ఆహరంకొరకై నన్ను చీరగా నేను నీ వద్దకు వచ్చి వడిలో కూర్చొని ఉన్నాను
అప్పుడు కోపముతో ఉన్న నీవు నవ్వుచు ఓ దార్చి వాయసముపై కోపించెను 


కాకి కోపాము కల్గించుటచే  నా కన్నుల వెంబడి అశ్రుబిందువులు జాలు వారెను
నా కన్నులను తుడుచుకోను చుండగా నీవు చూసితివి ఆసమయము నందును 
అలసట వలన నేను నీ అంకమున నిద్రించితిని, నా అంకమున తిరిగి నీవు నిద్రించెను 
నా అంకమున రాముడున్నప్పుడు ఆ కాకి సమీపించి నా వక్షముపై పొడిచెను


పదే  పదే  ఎగురుచు నన్ను అట్లే ఎక్కువగా ముక్కుతొ భాద పెట్ట సాగెను 
అప్పుడు రక్తబిందువులు రాలుచుండగా శ్రీ రాముడు నిద్రనుండి మేల్కాంచెను 
మహాభావువైన ఆ రాముడు స్తనములపై కాకిచే గీరగా ఏర్పడిన రక్తపు గీతలను 
చూచి కొప్పించిన సర్పమువలె బుసలు కొట్టుచు కోపముతో ఇట్లు పలికెను


గజముయోక్క తొండము వలే సుందరమైన ఊరువులను
చూచి నీ ఊరువులమద్య భాగమున నెవ్వరు గాయపరిచెను
కోపించిన ఐదు తలలుగల పన్నగముతో ఎవ్వడు క్రీడింప దలచెను
అంటూ రాముడు వాడిఅయిన గోళ్ళతో ఎదురగా ఉన్న వాయసమును చూసెను 


శ్రేష్టమైన ఆ కాకి దేవేంద్రుని పుత్రుడును 
స్వర్గ లోకమునందు విహరించు వాడును 
  వాయువుతో సమానమైన వేగంగలవాడును 
ఈ భూమండలములోనికి శీఘ్రముగా వచ్చెను 


మహాబాహువు బుద్దిమంతులలో శ్రేష్టుడును 
శ్రీ రాముడు కోపముచో నేత్రములు తిప్పెను 
కాకి విషయమున మిక్కిలి క్రూరముగా అలో చించెను
దర్భాసనమునుంది ఒక దర్బను తీసి భ్రహ్మ మంత్రమును  మంత్రించెను 


కాలాగ్నివలె ఆ వాయసమున కభిముఖముగా ప్రజ్వలించ సాగెను
అటుపిమ్మట శ్రీరాముడు ప్రదీప్తమైన ఆ దర్బను కాకిపై  విసెరెను
ఆ దర్బ ఆకాసము నందు కాకిని తరుము కొనుచు వెంబడించెను 
తన ప్రాణములు రక్షిమ్చుకొనుటకు లోకములన్ని  తిరగ సాగెను


తండ్రిచేతను, మహర్షులచేతను వాయసము  పరిత్యజింప పడెను
కాకి మూడులోకములు తిరిగి చివరకు శ్రీ రాముని శరణు  కోరెను
ఆ కాకిని చంప దగినదే అయిన శ్రీరాముడు జాలికొని రక్షించెను 
అలసిపోయి దుఖించు చున్న కాకిని చూసి శ్రీరాముడు ఇట్లనెను 


బ్రహ్మాస్త్రము వ్యర్ధము అగుట వీలు లేదు, ఏమి చేయవలెనో నీవె చెప్పవలెను 
నీ భాణముతో నా కుడి కన్నును పెకలించి తోసికొనమని శ్రీరాముని కోరెను 
శ్రీ రాముడు ప్రయోగించిన ఆ దర్భ ఆ కాకి కుడి కంటిని హింసించెను 
 ఈ విధముగా ఆ కాకి కుడికన్ను సమర్పించి ప్రాణనములను రక్షించు కొనెను


ఆ కాకి  రామునకూ, దశరధ మహారాజుకూ నమస్కారము చేసెను 
రాముని అనుజ్ఞ తీసుకొని తన నివాసమగు స్వర్గలోకముకు పోయెను 
ఓ రామ నా కొరకు ఆకాకి పై బ్రహ్మ అస్త్రమును ప్రయోగించి నావును
నన్ను అపహరించిన వానిని ఓ మహీపతి నీవెట్లా హింసించ కుండెను?  


ఓ పురుషోత్తమా నీవు నాపై నీవు మహొత్సాహము యుక్తముగా జూపుము దయను 
నీ వంటి సమర్దుడగు భర్త కల్గియున్న నేను అనాధ వలె కన్పటు చున్నాను 
నీవె నాకు చెప్పితివికదా 'దయ' ధర్మములలో కెల్ల ఉత్తమ ధర్మమను విషయమును 
నిన్ను మహావీర సంపన్నునిగను మహోత్సాహబలయుక్తునిగను నేనెరుగుదును


ఓ రామచంద్ర నివు గామ్భీర్యములొ సముద్రము వంటి వాడవును
సముద్రపర్యన్తముగల ధరణికి పతివి, ఇంద్రునకు సమానుడవును 
అస్త్ర విదులలో శ్రేష్టుడవు, సత్య బల పరాక్రమ  సంపన్ను డవును 
రాక్షసులపై నాకొరకు ఎందుకువలన ప్రయోగించావు అస్త్రములను ?



రాక్షసులనేలా నాశమొనర్చడు? హృదయమున నాగురించి వ్యాకులత యున్నను
లక్ష్మనుడైన సోదరుని ఆజ్ఞ తీసుకొని నన్నెలా  రక్షింపడు ? వీరుడైన సోదరుడును
నన్నెలా ఉపేక్షిమ్చు చున్నారు?  ఇంద్రునితో సమానము లైన రామ లక్ష్మణులును
నన్నుఎలామరచినారు? దేవతలనుకూడా లొంగ దీయగల శత్రు తాపసు లిద్దరును

 

నేనే ఏదో గొప్ప  మహా పాపము చేసి యున్నాను
సందేహము లేదు సమర్ధులై  యుండి కూడాను
శత్రుపీడకులైన ఆరామలక్ష్మణులు నన్నుమరిచెను
సీత కన్నీరు కార్చుచూ దీనముగా ఇట్లు పలికెను 



సీత మాటలకు ఓ దేవి నేను సత్యముపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను
శ్రీ రాముడు నీ యొక్క శోకము వలన అన్యకార్యవిముఖుడై యుండెను 
శ్రీ రాముడు దు:ఖపడుటనుచూసి లక్ష్మణుడు కూడా దుఖపడు చెండెను
ఎట్లో అతి కష్టంమీద నీన్నుగుర్తించాను, నీవుదుఖంచ నవసరము లేదును 



స్వల్ప కాలములో నీవు దు:ఖముల అంతమును చూడ గలవును
బలశాలులైన రాజపుత్రులిద్దరూ నిన్ను చూడాలని కోరికతో యుండెను
ఓ విశాలక్ష్మి నీకొరకు లోకములను భస్మముచేయగల వారై యుండెను
రావణుని సంహరించి రాఘవుడు నిన్ను అయోధ్యకు తీసుకు వెల్లగలుగును


ఓ సీతా నీ ప్రియ శ్రీ రామునకు ఏమి చెప్పవలెను
మహా బలసంపన్నుడగు లక్ష్మణునకు ఏమి చెప్పవలెను
పరాక్రమ వంతుడగు సుగ్రీవునకు ఏమి చెప్ప వలెను
భల్లూక వనరులకు ఏమిచేప్పవలేనో చెప్పమని కోరెను


హనుమంతుని మాటలకు శోక పీడిత ఐన సీత ఇట్లు పల్కేను
ఓ కపిశ్రేష్టా మనస్విని యగు కౌసల్యా  దేవి ఎవ్వనిని గనెనో
అతనికి తలవంచి నమస్కారము చేసితినని చెప్పవలెను
నా పక్షమున అతని క్షెమసమాచారములను అడుగవలెను


సుమిత్రా పుత్రుడైన లక్ష్మణుడు ఉత్తమములైన భోగవస్తువులను
పువ్వులను ప్రియమైన ఉత్తమస్త్రీలను మహోత్కృష్ట మైన సుఖమును
శ్రీరాముని అనుకూల్యమూలమున అతనిని రక్షించుటకై వెంట నుండెను
తల్లితండ్రుల అనుమతితో రామునికి తోడుగా ఉన్న లక్ష్మణుని కుశలమడగవలెను


రాముని పట్ల తండ్రి వలెను, నాపట్ల తల్లి వలెను వెలుగు చుండు వాడును
అగు లక్ష్మణుడు, వీరుడు, వృద్ధసేవకుడు, లక్ష్మీసంపన్నుడు, మితభాషియును
శక్తియుక్తుడు, మ్రుదుస్వభావముగలవాడు నన్ను అపహరించినట్లు తెలియకుండును
నాకంటే గూదా సోదరుడగు లక్ష్మణుడు శ్రీ రామ చంద్రునకు మిక్కిలి ప్రియుడును

            
లక్ష్మణుడు కార్యబారమున నియుక్తుడైన చక్కగా నిర్వహించును
లక్ష్మణున్ని జూచిన శ్రీరాముడు తనమిత్రుడైన తండ్రిని మరచిపోవును
మృధుస్వభావముగలవాడు సదా పవిత్రుడు శుద్ధుడు సమర్దుడును
రామునికి ప్రియ స్నేహితుడైన  వానరశ్రెష్టుడిని కుశలమడగ వలెను 



ఓ వానర యూధపా నీవు ఈ కార్యము ఎట్లు నిర్వహింపబడునో అట్లే చేయవలెను 
దీనికి నీవే  ప్రమాణము రాఘవుడు నా విషయమై  ప్రయత్నశీలుడగు నట్లును             
పదే  పదే  నా కష్టమును నాభార్తయగు శ్రీ రామునికి అన్నియు  తెలుప వలును 
దాశరధికి నేను ఒక నేలమాత్రమే జీవించగలనని పిదప జీవించనని చెప్పవలెను 


నేను సత్యమును చెప్పుచున్నాను, రావణునిచే బందింప బడినదానను
 పాతాళమునుండి ఇంద్రుని లక్ష్మిని రక్షించినట్లుగా నీవు రక్షించ వలెను
పిమ్మటసీతకొంగులో ముడిపెట్టివున్నచూడామణిని మారుతికి ఇచ్చెను
దీనిని రామునికి ఇమ్ము అని చెప్పుచూ హానుమంతునకు ఇచ్చెను 


వీరుడైన హనుమంతుడు ఆ సర్వోత్తమమైన మణిని గ్రహించి తన వ్రేలికి పెట్టుకొనెను 
కాని అతడు వ్రేలికి తోడుగలేక పోయెను ఆమనిరత్నము తీసుకొని నమస్కరించెను 
ఆమె చుట్టూ ప్రదక్షణ చేసి ప్రణామాచరించి ఆమె ప్రక్కనే అనుమతికోసం  నిలబడెను 
హనుమంతుడు సీత దర్శనము లభించినందుకు సంభాషించినందుకు సంతోషించెను 


మనస్సులో రామునివద్దకు వెళ్లి పోయెను మారుతి శరీరము మాత్రము ఇక్కడే ఉండెను 
జానకిచే నిజ ప్రభావమున ధరింప బడి మిక్కిలి ఉత్తమమైన మణి శ్రేష్టమును 
గ్రహించగానే హనుమంతుని శరీరము గాలిచే కదల్చి వేయబడిన చెట్ల వలె వనికెను
మనస్సులో మిక్కిలి సంతోషము పొంది తిరిగి వెళ్లి పోవుటకు ప్రయత్నించెను


 శ్రీ సుందరకాండము నందు 38 వ సర్గ సమాప్తము 

No comments:

Post a Comment