Friday, 24 July 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (40వ సర్గ)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
      శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


 40వ సర్గ (వాల్మికి రామాయణములోని 25శ్లోకాల  తెలుగు వచస్సు)
("సీత రామునకు మరలా సందేసము ఇచ్చుట.  హనుమంతుడు ఆమెను ఓదార్చి ఉత్తర దిక్కువైపు ప్రయాణ మగుట)


సీతాదేవి మహాత్ముడైన హనుమంతునియోక్క అమృత వచనములు వినెను 
దెవకన్యతో సమానురాలైన ఆమె హితమైన వాక్యములు మరలా పల్కెను 
 సగము మాత్రమె నాటుకొనిన సస్యముగల భూమి వర్షము పడగానే వికసించి నట్లును   
మంచి మాటలు చెప్పుచున్నావు హనుమంతుడా నిన్ను చూసి నేను సంతోషించు చున్నాను 
దుఖముచేత కృశించిన అవయవములతొ నేను ఆ రామున్ని స్ప్రుశించవలెను 
అనే కోరిక ఉన్నది. నా పై దయ వుంచి ఆ కోరిక సఫలమగునట్లుగా నీవు చేయవలెను 
కోపముతో కాకిపై  బ్రహ్మాస్త్రమును వేసిన విషయమును గుర్తు చేయవలెను 
నేను నీకు చెప్పిన విషయాలు చూడామణిని ఆనవాలుగా చూపవలెను
రామా ఒకనాడు నేను నీతొ కలసుకున్నప్పుడు నా నుదుట తిలకము చెరిగి పోయెను 
నీ చేతితో మనస్సిలాతిలకము నున్చినట్లు గుర్తుకు తెచ్చుకోమని చెప్పవలెను 
పరాక్రమవంతుడువు మహేంద్ర వరునులతో సమానుడవు అయినను
హనుమా రాక్షసలమద్య ఉన్న నన్ను ఉపేక్షిమ్చుటకు కారణము అడుగ వలెను  


ఓ రామ ఈ దివ్యచూడామణిని చాలా జాగర్తగా కాపాడుకొను చున్నాను
ఈ దుఖములో దీనిని చూసుకొనుచు నిన్ను చూసినట్లు సంతోషించు చున్నాను   
జలములో పుట్టిన సోభాయుకమైన ఈ చూడామణిని నీకుపంపు చున్నాను  
శోకముతో వ్యాకులరాలునైయి నేను ఈ లంకలో ఇక జీవించ జాలను


నీవు ఏనాటికైనా రాక పోదువా అని ఆశతో భరింపరాని కష్టములను 
చాల భయంకరమైన రాక్షస స్త్రీల మాటలను నేను సహించు చున్నాను 
శత్రునాశకుడైన రామా నేను ఒక్క మాసము మాత్రమె ఇక్కడ జీవించగలను
ఈ రావణుడు చాలా క్రూరుడు అటుపై నీవు రాకపోతే నేను జీవించ లేను
  

 రావణ దృష్టి కూడా నావిషయమున సరిగా ఉండుట లేదును
నీవు కూడా ఆలస్యము చేసినట్లు వినినపిదప క్షణమైన జీవించజాలను
 సీతాదెవి యొక్క కన్నీటితో ఈకరుణ మయమగు ప్రసంగమును 
 విని మహాతేజస్వి అగు మారుతాత్మజుడ హనుమంతుడు ఇట్లు పలికెను 


సీతాదేవి రాముడు నీయొక్క శోకము మూలమున అన్నీ కార్యముల లోను విముఖతను 
 చూపుచున్నాడు సత్యముపై శపధము చేసి నెనీవిషయమును చెప్పుచున్నాను
రాముడు శొకాభిభూతుడు కాగా లక్ష్మణుడు మిక్కిలి పరితాపము చెందుచుండెను
ఎట్లో అతికష్టముమీద నీవు కన్పించితివి దుఖమును ఇక విడువవలెను


 నిర్దోషురాలా రామునకు తెలిసినదియును ప్రీతి కల్గించే గురుతు           ఏదైనా ఇవ్వవలెను 
అపుడామె ఇట్లు పల్కేను నీకు ఉత్తమమైన చూడా మణిని ఇచ్చి యున్నాను 
హనుమా ఆ ఆభరణమును చూసి నీ మాటలు రాముడు విశ్వసించ గలుగును
ఆ ప్లవ సత్తముడు చూడామణిని గ్రహించి శ్రిరస్సుతో ప్రణమిల్లి వెళ్ళుటకు సిద్దపడెను 


అక్కడ నుండి ఎగిరిపోవుటకై శరీరమును పెంచ సాగేను 
మహావేగా సంపన్నుడు ఉత్సాహవంతుడగు వానరుడను 
చూసి కన్నుల నిండా నీరు తెచ్చుకొని ధీనురాలగు సీత ఇట్లు పలికెను 
 హనుమా రామలక్ష్మణులకు  సుగ్రీవునకు వానరులకు నా కుశల వార్తను తెలుపవలెను 


ఈ ధుఖసాగరము నుండి దాటిన్చగలవో అట్లే చెప్పవలెను
రాక్షస స్త్రీలు భయపెట్టుచున్నారని రామునకు చెప్పవలెను 
హనుమంతుడు హర్షముతో నిండి అంతరంగము కలవాడై క్రుతార్దుడైనాట్లు తలచి తాను
చేయకుండగా నున్న కార్యమును గూర్చి మనస్సులో విచారించి అక్కడ నుండి ఉత్తర దిక్కుకు బయలుదేరెను 

శ్రీ సుందర కాండము నందు 40 వ సర్గ సమాప్తము  
                                                        
                                                                                                                                                                                                                                                                                                                        

No comments:

Post a Comment