శ్రీరాముడు-యోగరహస్యము-సుందర కాండము-9
హనుమ సీతను గుర్తించుట
హనుమంతుడు బలముగా కదపబడగా వృక్షముల నుండి ఆకులు, పూలు, పండ్లు పూర్తిగా రాలిపోయి బోసిపోయిన చెట్లు జూదములో పూర్తిగా ఓడిపోయి వస్త్రాభరణములను సైతము కోల్పోయిన జూదరి వలె యున్నవి. "నిర్ధూత పత్ర శిఖరాః శీర్ణ పుష్ప ఫల ద్రుమాః నిక్షిప్త వస్త్రా౭౭భరణా ధూర్తా ఇవ పరాజితాః 15" (జూదరులు మిక్కిలి వ్యసనమునకు లోనగుదురు. వారు వివేక భ్రష్టులై అమూల్యమైన వస్తువులను, తుదకు తమ వస్త్రములను కూడా జూదము నందు ఫణముగా పెట్టుదురు. వాటిని ఓడిపోయినను సిగ్గు పడరు. ధర్మరాజు కూడా ఇట్టి వ్యసనపరుడై తన రాజ్యమును, చివరకు భార్యను కూడా జూదములో ఓడిపోయినాడు. కావున జూదమాడుట ప్రమాదకరం).

హనుమ అక్కడ ఆకులతో దట్టముగా యున్న ఒక శింశుపా వృక్షము నెక్కి అటునిటు కలయ చూచెను. అప్పుడు అచట మలినమైన వస్త్రమును ధరించి, ఉపవాసములతో కృశించి, దీనురాలై రాక్షస స్త్రీల మధ్యలో ఉన్న స్త్రీమూర్తిని గాంచెను. జ్వాజ్వాల్య మానముగా ప్రకాశించుచున్న అగ్నిజ్వాలను పొగ కమ్మేసినప్పుడు దానికాంతి స్పష్టముగా గోచరించదు. అట్టి స్త్రీ మూర్తిని గుర్తించవలెను. (ఇప్పుడు హనుమ యుక్తియుక్తముగా తర్కించుకొని ఆమెను గుర్తించుటకై యత్నము చేయుచున్నాడు). ఆమె మలినమైన ఒకే ఒక వస్త్రమును ధరించి యుండెను. దుఃఖియై దీనావస్థలో యున్నది. జడగట్టిన ఆమె కేశపాశము నల్లత్రాచును బోలె కటిప్రదేశము వరకును వ్రేలాడుచుండెను. ఋష్యమూక పర్వతము మీదుగా వెళ్లుచున్నప్పటి అంగన రూపురేఖలే ఈమె యందు గోచరించుచున్నవి. ఈమె తన శోభలచే పున్నమినాటి వెన్నెలవలె అందరికి ఆహ్లాదము కలిగించునట్లున్నది కావున ఈమె సీతయే అయి ఉండవచ్చు. ఈ విధముగా సీతను చూచి హనుమ ఎంతయో సంతసించెను. ఈమె కొరకే శ్రీరాముడు వాలిని సంహరించెను. నేను సముద్రమును దాటి లంకానగరమును చూచితిని.
ఇక శ్రీరాముడు సముద్ర పరివేష్టితమగు ఈ భూమండలమునే కాదు, జగత్తునంతయు తలక్రిందులు చేసినను సమంజసమే. (రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకా౭౭త్మజా, త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నా౭౭ప్నుయాత్ కళామ్.14). రాముని యందు ప్రీతిచే తన శరీరమును నిల్పుకొని యున్నది (నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్ప ఫల ద్రుమాన్ ఏక స్థ హృదయా నూనం రామమ్ ఏవా౭నుపశ్యతి 25). హనుమ సీతను స్పష్టముగా చూడగోరి దృష్టిని అటు ప్రసరింప చేసెను. అప్పుడు ఆయనకు ఆ సమీపముననే భయంకరాకారమైన అనేకమైన రాక్షస స్త్రీలు కనబడిరి. వారు ఎలా ఉన్నారంటే ..
ఏకా౭క్షీమ్ ఏక కర్ణాం చ కర్ణ ప్రావరణాం తథా
అకర్ణాం శ౦కు కర్ణాం చ మస్తకో చ్ఛ్వాస నాసికామ్ 5.17.5
అతి కాయో త్తమా౭౦గీం చ తను దీర్ఘ శిరో ధరామ్
ధ్వస్త కేశీం తథా౭కేశీం కేశ కమ్బళ ధారిణీమ్ 5.17.6
లమ్బ కర్ణ లలాటాం చ లమ్బోదర పయోధరామ్
లమ్బౌష్ఠీం చిబుకౌష్ఠీం చ లమ్బా౭౭స్యాం లమ్బ జానుకామ్ 5.17.7
హ్రస్వాం దీర్ఘాం చ కుబ్జాం చ వికటాం వామనాం తథా
కరాళా౦ భుగ్న వస్త్రాం చ పి౦గా౭క్షీం వికృతా౭౭ననామ్ 5.17.8
వికృతాః పి౦గళా: కాళీ: క్రోధనాః కలహ ప్రియాః
కాలా౭౭యస మహా శూల కూట ముద్గర ధారిణీః 5.17.9
వరాహ మృగ శార్దూల మహిషా౭జ౭శివా ముఖీః
గజో ష్ట్ర హయ పాదా శ్చ నిఖాత శిరసో౭పరాః 5.17.10
ఏక హస్తైక పాదా శ్చ ఖర కర్ణ్య౭శ్వ కర్ణికాః
గోకర్ణీ ర్హస్తి కర్ణీ శ్చ హరి కర్ణీ స్తథా౭పరాః 5.17.11
అనాసా అతి నాసా శ్చ తిర్య ఙ్నాసా వినాసికాః
గజ సన్నిభ నాసా శ్చ లలాటో చ్ఛ్వాస నాసికాః 5.17.12
హస్తి పాదా మహా పాదా గో పాదాః పాద చూళికాః
అతిమాత్ర శిరో గ్రీవా అతిమాత్ర కుచోదరీః 5.17.13
అతిమాత్రా౭౭స్య నేత్రా శ్చ దీర్ఘ జిహ్వా నఖా స్తథా
అజా ముఖీ ర్హస్తి ముఖీ ర్గో ముఖీః సూకరీ ముఖీః 5.17.14
హయో ష్ట్ర ఖర వక్త్రా శ్చ రాక్షసీ ర్ఘోర దర్శనాః
శూల ముద్గర హస్తా శ్చ క్రోధనాః కలహ ప్రియాః 5.17.15
కరాళా ధూమ్ర కేశీ శ్చ రాక్షసీ ర్వికృతా౭౭ననాః
పిబన్తీ స్సతతం పానం సదా మాంస సురా ప్రియాః 5.17.16
మాంస శోణిత దిగ్ధా౭౦గీ ర్మాంస శోణిత భోజనాః
తా దదర్శ కపి శ్రేష్ఠో రోమ హర్షణ దర్శనాః 5.17.17
ఈ విధముగా హనుమ సీతను గుర్తించుటలో రాత్రి గడచి వేకువ జాముఅయ్యెను. ఈమె దుఃఖమును తొలగించుటకు ఏమి చేయవలెనని ఆలోచింప సాగెను. అజ్ఞానము ఆవరించి సద్వస్తువగు ఆత్మ కనబడకుండా చేయు జన్మయే రాత్రి.
శ్రీరామ జయరామ జయజయ రామ
--((***))--

No comments:
Post a Comment