Friday, 31 July 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (45 వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
      శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:





 45వ సర్గ (వాల్మికి రామాయణములోని 17శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు ఏడుగురు  మంత్రి  పుత్రులను వధించుట    )


రావణుడు మంత్రి కుమారులేడుగురిని పిలిచి  ప్రేరేపించెను 
 అగ్నితో సమానమైన కాంతి గల బలీయులైన మంత్రి కుమారులును 
అశ్వములు కట్టిన రధములపై  సైనికులు మారుతి  వద్దకు వచ్చెను
వారు జయమును సంపాదించుటకు ఒకరి కొకరు పోటీతో యుద్దము నకు వచ్చెను 


వారు స్వర్ణజాలములగల రధములలో పెద్ద పతాకముల తోను ఆయుధముల తోను  
ఉత్తమములైన అశ్వములతోను పెద్ద సైన్యముతోను యుద్దమునకు వచ్చెను
మేఘములవంటి వారు బంగారముతో చేసిన చాపములు ధరించి వచ్చెను
మంత్రికుమరులందరూ ఉస్చాహముతొ హనుమంతుని జయించాలని వచ్చెను  

కింకరులు మారుతి చేతిలో మరణించినట్లు తెలుసుకొనెను 
మంత్రి కుమారుల తల్లి తండ్రులు భాదలో మునిగి ఉండెను
భందువులకు మిత్రులకు వీరేమగుదురోనని భయము కల్గెను
 దు:ఖముతో వ్యాకులత్వముతొ సైనికులు తల్లితండ్రు లుండెను 


స్వర్ణాభరణములను ధరించి ఏడుగురు మంత్రి పుత్రులును
సైనికులతో ఆరాక్షసులు మారుతిపై వర్షాకాల మేఘాలవాలే కదిలెను
మేఘాల జల్లుమెదలడి కుంభవృష్టి లాగ భానాలు మారుతిపై  వేసెను 
హనుమంతుని కదలనీయకుండా అందరు కలసి భానములతో  భాదించెను 

ఇంద్రధనస్సుతో కూడి మేఘములను వాయుదేవుడు ఆడు కున్నట్లును
నిర్మలమైన ఆకాశము అంతా ఒక్కసారి అద్బుతమైన గాలి వీచెను
సైనికుల ప్రయత్నాలు విఫలము చేసి మారుతి ఎగురుచూ పరుగేట్టేను
 హనుమంతుడు మంత్రి పుత్రులపై భాణాలు వేసి వారితో క్రీడించెను


హనుమంతుడు భయంకరనాదము చూసి మంత్రి పుత్రులు భయపడెను 
ఆకాశ మండలమున అద్భుతమైన వెలుగుతో మారుతి ప్రకాశించెను 
మారుతి భీకర రూపమును దాల్చి చిక్కిన వారిని చిక్కినట్లు చంపెను
రాక్షసులకు పారిపోయే దారిలేక మారుతితో యుద్దముచేయలేక ఉండెను  
      
                                       
హనుమంతుడు కొందరిని అరచేతులతోను 
మరికొందరిని బలమైన పాదఘాతాలతోను 
ఇంకొందరును చేతిని మడిచి పిడిగ్రుద్దులతోను
మరికొందరిని వాడి అయిన గోళ్ళతో చీల్చి చంపెను 



కొందరి రాక్షసులను వక్క్షస్తలముపై పిడిగుద్దులతోను 
మరికొందరిని తొడల క్రింద ఇరికించి మదించి చంపెను
హనుమంతుని వేగమునకు ధ్వనికి కొందరు చనిపోయెను 
హనుమంతుని చేతిలో మంత్రి పుత్రులందరు చనిపోయెను


అప్పుడు ఏనుగులు  వికృతస్వరముచేయుచూ పరుకేట్టు చుండెను
గుర్రములు పెద్దగా సకిలిస్తూ క్రింద పడి చని పోయెను
విరిగిపోయిన రధములు, చత్రములు, ద్వజములు పడి ఉండెను
భీకరముగ రక్త మార్గముల మద్య  రాక్షసులు చచ్చి పడి ఉండెను   



అప్పుడు అనేక విధములైన స్వరములతో లంక అంతా మార్మోగెను 
పిక్కబలముగల కొందరు రాక్షసులు రావణునికి చనిపోయినట్లు చెప్పెను 
హనుమంతుడు అధికబలముతో పెద్దగా గర్జనచేసి అందరిని భయ పెట్టెను 
హనుమంతుడు ఇంకా యుద్దము చేయ దలచి తోరణము వద్ద కూర్చొనెను   

సుందర కాండ నందు 45వ సర్గ సమాప్తము

  

Thursday, 30 July 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (44 వ సర్గ)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
      శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:




 44వ సర్గ (వాల్మికి రామాయణములోని 20శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు ప్రహస్త పుత్రుడైన జంబుమాలిని వధించుట   )


బలవంతుడును, విశాలమైన దంష్ట్రముగల వాడును సమర్దుడును 
ప్రహస్తుని పుత్రుడును నగు జంబుమాలి యనే రాక్షసుడును
రాక్షసరాజగు రావణునిచే నాజ్ఞాపింపబడి, కొందరి సైనికులతోను 
ధనుర్ధారియై ఎర్రని వస్త్రమలను ధరించి యుయుద్దమునకు బయలు దేరెను 

ఆమహరాక్షసుడు కోపముచే కన్నులు త్రిప్పుచు ఇంద్రదనస్సును 
పోలినదియును నగు మహాదనస్సును,పిడుగు,వజ్రాయుదమును
అందమైన భాణములతోను అందర్ని ఆకర్షిమ్చుచే  సమర్దుడును
మహావీరుదైన కాపిని జయించాలని పట్టుదలతో బయలు దేరెను
గాడిదలు కట్టిన రధము నెక్కి వచ్చిన జంబుమాలిని చూసి సంతోషించెను
హనుమంతుడు వేగవంతుడిగా మారి సంతోషముతో గొప్ప ధ్వని చేసెను
జబ్బు మాలి కుడా ధనుస్సు చరచుటవల్ల ద్వని అన్నిదిక్కుల వ్యాపించెను
ఇరువురి ధ్వని వళ్ళ సముద్రఘోషకన్న మించిన శబ్దము వేలుబడెను 


మహాబాహువైన హనుమంతున్నీ జంబుమాలి తీవ్ర చూపులతొ చూసెను 
విజయము సాధించాలని ఆత్రుతతో తీక్షనములైన భాణములను మారుతిపై వేసెను
ఇంకా ముఖమునందు అర్ధచంద్రభాణములతోను శిరస్సుపై కర్ణయుక్త బాణములతోను   
బాహువులపై పది బాణములతోను తూట్లు పడేట్లుగా రక్తం కారే విదముగా కొట్టెను 


జంబుమాలి వేసిన భాణప్రబావమువలన హనుమంతుని మొఖము రక్తవర్ణముగా మారెను
సరత్కాలముపు సూర్యకిరణములచె విద్దమై వికసించిన పద్మమువలె ప్రకాసించెను
రక్తరంజితమైన ఆ ఎర్రని ముఖముపై ఆకాశమునుండి స్వర్ణ బిందువులు పడి నట్లును 
బిందువులచే సిక్తమైన విశాలమైన రక్త పద్మము వాలే ప్రకాశిమ్చు చుండెను 


బానాబిహతుడైన ఆ మహాకపి జమ్బుమాలిపై మిక్కిలి కోపము వచ్చెను
అప్పుడే హనుమంతుడు ప్రక్కన కనిపించిన పెద్ద బండను పెకలించెను
వేగవంతముగా త్రిప్పి ఆ బండను మారుతి జమ్బుమాలిపై విసిరెను
జంబుమాలి ఆ శిలను పది భానములతో తునా తునకలు చేసెను 


మహాబలశాలి ఐన హనుమంతుడు పెద్ద మర్రిచెట్టును పీకి జంబుమాలిపై విసిరెను 
జంబుమాలి వాడిఐన బాణములతో ఆ చెట్టును రెండుగా చీల్చి గాలిలోకి విసెరును 
వేగముగా ఐదు  బాణములను భుజముపైనాను, ఒక బాణము రొమ్ము పైనను 
జంబుమాలి పదిబాణాలతో హనుమంతుని ఉరము మధ్యను వేసి భాద కలిగించెను 


శరీరమంతా బాణములు గుచ్చుకొనగా హనుమంతునకు వేర్రికోపము వచ్చెను 
హనుమంతుడు అక్కడే ఉన్న అతి పెద్ద ఇనుప గదను తీసుకోని త్రిప్ప సాగెను 
 హనుమంతుడు గాలికన్న వేగాముగా త్రిప్పి జంబుమాలి విశాలమగు రొమ్ముపై విసేరెను
వెంటనే జంబుమాలి అవయవములు అలంకారములు చూర్ణమై పోగా చచ్చినేలపైపడెను 

రావణుని వద్దకు కొందరు రాక్షసులు పోయి జంబుమాలి  చూర్మమయ్యె నని చెప్పెను
రావణుడునిహిడైనాడు అన్న వార్త విన్న నంతనే కోపముగా కన్నులు ఎర్ర చేసెను
కన్నులను తీవ్రముగా త్రిప్పుచూ అమాత్య 7గురు పుత్రులను యుద్దము నకుపంపెను
ఆ అమాత్య పుత్రులు పోటి పడుచు నేనే విజయము సాధించాలని యుద్ద భూమికి వచ్చెను

శ్రీ సుందర కాండము నందు 44 వ సర్గ సమాప్తము

Tuesday, 28 July 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (43 వ సర్గ)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
      శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:



 43వ సర్గ (వాల్మికి రామాయణములోని 25 శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు చైత్యప్రాసాదమును ద్వంసము చేసి దాని రక్షకులను వధించుట )


హనుమంతుడు కింకర వదానంతరము తనలో తాను  ఇంట్లను కొనెను 
నేను వనమునుభగ్నము మొనర్చితిని ఇక నాశనము చేయవలె చేత్యపాసాదమును
ఆచేత్య ప్రాసాదమునను ధ్వంసము చేయవలెననితలచిఅన బలమునను
ప్రదర్సిమ్చుచు మెరుశిఖరమువలె ఉన్న ఆ ప్రాసాదముపై ఎగిరి కూర్చుండెను 


హనుమంతుడు చేత్యప్రాసాదముపై అధిరోహించి మరియొక సూర్యుని వలే ఉండెను
ఆక్రమింప సక్యముకాని ఉత్తమమైన ఆప్రాదమును ఆక్రమిమ్చియును 
శోభతో తెజరిల్లుచూ పారియాత్ర పర్వతమువలె కన్పడు చుండెను
హనుమంతుడు సుకుమారమైన కాయమును పెద్దగా పెంచి వేసెను


తనగర్జన ధ్వనితో ప్రతిద్వనివలె ఆ ప్రాసాదమును బ్రద్దలు కొట్టెను
అస్పోటన శబ్దము విన్నవారి చేవులయందు ఘోష వినబడుచుండెను 
ఆశబ్దమునకు పక్షులునేలపై పడిపొయెను, చెత్యప్రాదులు మూర్చ పొయెను
అప్పుడు హనుమంతుడు పెద్దగా అక్కడ ఉన్న సైనికులతో ఇట్లు తెలియపరిచెను 

జయ త్వతిబలో రామో లక్షణ శ్చ మహాబల:!
రాజా జయతి సుగ్రీవో  రాఘవేణా భిపాలిత: !!

దాసోహం కోసలేంద్రస్య రామ స్యా క్లిష్ట కర్మణ:!
హనుమాజ్ఞ్చాత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ:!! 

న రావణ సహస్రమ్  మే యుద్ధె  ప్రతిబలమ్ భవేత్ !
సిలాభి స్తు ప్రహరత: పాదపై శ్చ సహస్రశ:!! 

అర్ధయిత్వా పురీమ్ లంకా మభివాద్య చ మైధిలీమ్ !
సమృద్దార్దో  గమిష్యామి మిషతాం సర్వ రక్షసామ్ !!

భావం
అక్కడ వచ్చిన కింకరులతో హనుమంతుడు ఈ విధముగా ఉద్ఘోషించెను
అత్యంత బల సంపన్నుడగు రామునికి, మహాబలుడగు లక్ష్మణునికి, రాఘవునిచే రక్షింప బడిన సుగ్రీవునికి, జయమగుగాక
 నేను అనాయాసముగా తన కర్మలను నిర్వహించు శ్రీరామ చంద్రునికి దాసుడను,  పవనుని పుత్రుడనగు హనుమంతుడను, శత్రుసైన్యమును హతమార్చెదను యుద్దములో శిలలతోను వేలకొలది వృక్షములతోను ప్రహారము చేయు  నాకు వేయి మంది రావణులైనను ధీటుగారు.  నేను లంకను నాశసనము చేసి, మైధిలికి అభివాదము చేసి, రాక్షుసు లందరూ చూచు చుండగా, క్రుతక్రుత్సుడనై,  తిరిగి పోయెదను.  అంటూ పెద్ద గా గర్జన చేసెను.  అతని యొక్క గర్జన శబ్దమును విని రాక్షసు లందరూ భయబ్రాన్తులై సంద్యాకాలం మేఘమును బోలిన  హనుమంతుని చూసిరి.

హనుమంతుని ధీటుగా ఎదుర్కోనవలేనని కొందరు చేత్యప్రాసాదులు  వచ్చెను 
వారు పెక్కుఆయుధాలను, గండ్ర గోడ్డల్లను తీసుకొని వచ్చి చుట్టు  నిలబడెను 
మహాకాయములుగల ఆ రాక్షసులు ఆయాశస్త్రములను హనుమనిపై ప్రయోగించెను 
బంగారు తోడుగులుగల పరిఘలతో హనుమంతునితో యుద్దము చేసెను 


హనుమంతునిచుట్టు ఉన్న ఆ రాక్షసుల సముదాయ మంతయును
గంగానదిలో జలములో ఏర్పడిన పెద్ద దైన  సుదిగుండమువలె  ప్రకాశిమ్చెను 
పిమ్మట హనుమంతుడు కోపించి భయంకరమైన రూపమును దాల్చెను 
ఆప్రాసాదమునందున్న బంగారముచే అలంకృతమైన పెద్ద స్తంభమును పెకలించెను 


హనుమంతుడు నూరు అంచులు గల ఆస్తంభమును గిరగిరా త్రిప్ప
సాగెను
అప్పుడు దానియందు అగ్నిపుట్టెను ఆ అగ్నితో  దరిచేరిన రాక్షసులను సంహరించెను 
ఇంద్రుడు వజ్రాయుధముతొ రాక్షసులను సంహరించినట్లు హనుమంతుడుసంహరించెను 
శోభాయుక్తుడైన మారుతి ఆకాశము నందు నిల్చొని పెద్దగా ఇట్లు పలికెను 


మావంటి వారు వేల కొలది మహాకాయులు నాల్గువైపులా పంప బడుచుండెను
సుగ్రీవునికనుచరులైన వేలకొలది కపిపుంగవులు భూమి అంతయు తిరుగుచుండెను 
వారిలోకొందరు 10 ఏనుగులు బలముగలవారును, మరికొందరు 100 ఎనుగులు బలముగల వారును
మావంటి ఇతరవానరులు సహస్త్ర ఎనుగుల బలము గలవారుకూడా ఉండెను 


కొన్దరు జల ప్రవాహముతొ సమాన బలము గలవారును
మరికొందరువాయ్వుతో సమాన బలముగాలవారును 
కొందరు వానరు వారిబలము ఇంతయని లెక్కకట్టలేని వారును
అట్టి బలముగలవారు నఖద్యాయుధములు ధరించినవారు ఇక్కడకు రాగలుగును 


లక్షలు కోట్లు అర్బుదముల సంఖ్యతొ గల హరివీరులను 
వెంట తీసుకొని మిమ్ము చంపగల సామర్ద్యముగల సుగ్రీవుడును 
భల్లూకముతో ఇక్కడకు వచ్చినా ఈ నగరము నాశనమగును
మీరు మరణించ గలుగును రావణుడు కూడా మరణించును 


మహాత్ముడైన ఇక్ష్వాకవంశ వీరుడైన రామునితోను
అకారణమున వైరము బెట్టుకొనిన రావణుడును  
 ఈ పుడమి నందు ఉండ జాలుడు అని పల్కెను 
హెచ్చరిస్తూ ఇంకాయుద్దము చేయాలని కోరికతో అక్కడే ఉండెను

శ్రీ సుందర కాండము నందు 43వ సర్గ సమాప్తము 

Sunday, 26 July 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (42వ సర్గ)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
      శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


 42వ సర్గ (వాల్మికి రామాయణములోని 44శ్లోకాల  తెలుగు వచస్సు)
("ఎవరోఉద్యానమును ధ్వంసము చేసినట్లు రాక్షస స్త్రీలు తెలుపగా విని రావణుడు కింకరులను పంపగా హనుమంతుడువాళ్ళను సంహరించుట)


హనుమంతుడు అశోకవనములోని వృక్షములను విరుచునప్పుడు పెద్దగా  శబ్ధము  చేసెను
వనమునండలి మృగములు ప్పక్షులు పెద్దగా నాదములు చేయుచు ప్రాణాలు రక్షిమ్చుకొనెను
ఆ తరువాత వికృతమైన ముఖములు గల రాక్షస వనితలు నిద్రాభంగము కలిగి భయపడెను 
ఆ రక్షకులకు  అప్పడు భయంకరమైన అపశకునములు లంకలో కన్పింప సాగెను


వనమును భగ్నచేస్తున్న వీరుదైన మహాకపిని స్త్రీలు ఒక్కసారి దర్శించెను 
అపుడు స్త్రీలకు భయము కల్గిన్చుటకు భీకారాకార రూపమును ధరించెను 
అపుడు హనుమంతుడు గోప్పధైర్యముతో బలమును పెంచి గొప్ప  నాదము చేసెను
మహాబలసంపన్నుడు అగు వానరుని చూసి రాక్షస స్త్రీలు జానకిని ఇట్లు అడిగెను 
ఓ విశాలాక్షి ఇతడెవరు? ఎవరికీ చెందినవాడు? ఎక్కడనుండి ఎందు నిమిత్తము ఇక్కడకు వచ్చెను
నీతొ యితడు ఎందులకు సంభాషణము చేసినాడు? నీతొ ఇతడేమి మాట్లాడెనో చెప్పవలెను
ఒనల్లని కనుబొమలు దానా? నీకేమి భయములేదు  మాతో నీకు తెలిసిన నిజం చెప్పవలెను 
అప్పుడు సర్వాంగ సుందరియు, పతివ్రతయునగు సీత వారితో ఇట్లు బదులు పలికెను 
భయంకరమైన రాక్షసుల మాయలు గూర్చి తెలుసుకొనుటకు  నాకు జ్ఞానము ఎక్కడుండెను 
యితడు ఎవరో ఏమి చేయు చున్నాడో, ఎక్కడనుండి వచ్చాడో  మీకె తెలియ వలెను
సంశయము లేదు నేను కుడా ఇతనిని చూసి చాలా భయము చెందితిని పాముపాదాలు పాముకే తెలియును
ఇతదేవ్వడో నాకు తెలియదు కామరూపుడైన రాక్షసుడే ఇట్లు వచ్చి యుండ వచ్చును 
రాక్షస స్త్రీలు సీత మాటలు విని హనుమంతునికి భయపడి అన్నిదిక్కుల పరుగెట్టేను 
కొందరు స్త్రీలు సీతను రక్షించుటకు అక్కడే ఉండెను మరికొందరు రావణునకు ఈ వార్త తెలిపెను 
వికృతమైన ముఖముగల రాక్షస స్త్రీలు రావణుని సమీపమున కరిగి వికట రూపమును 
ధరించిన భయంకరుడగు ఆ వానరుని గూర్చి రావణునికి ఇట్లు వివరించెను 
ఓ రాజ అశోకవన మద్యమునకు భయ్యన్కరమైన ఒక వానరుడు వచ్చి యుండెను 
అతడు అమితముగా విక్రమము గలవాడు సీతతొ ఏమో మాట్లాడి అక్కడే ఉండెను 
లేడి నేత్రములు గల సీతను మేము ఎంత అడిగానను వానరుని గూర్చి ఎమీ చెప్పక ఊరకుండెను
మా ఉద్దేశ్యము సీతాన్వేషణము కొరకై రామునిచె పంపబడిన వానరుడై యుండ వచ్చును 


అతడు ఇంద్రుని యోక్క లేక కుబేరుని యోక్క దూతయే అయి ఉండ వచ్చును  
ఆశ్చర్యకరమైన రూపము గల అతడు, అనేక విధములైన మృగముల తోను 
పక్ష్సులతోను నిండిన దీ అయిన ఉద్యానవనమును పూర్తిగా శాసనము చేసెను 
ఉద్యానవనములో అతడు నాశనము చేయని పదేశ మనేది లేకుండెను


చక్కని చిగురుటాకులతోడను తనరారు సిన్సుపావృక్షమును మాత్రము అతగాడు పాడు చేయక ఉంచెను 
సీతతొ సంభాషించి వనమును నాశనము చేసిన ఉగ్రరూపౌడైన ఆ కపికి తగిన శిక్ష విధించవలెను
ఓ రాక్షసరాజ తన జీవితము విడుచుటకు సిద్దముగా ఉన్నవాడు తప్ప మరెవ్వరైనను
నీ వనము నందుంచిన ఆ సీత తో మాటలాడుటకు ఎట్లు సాహసించును   

  రాక్షశేశ్వరుడైన రావణుడు రాక్షస స్త్రీలమాటలు విని నేత్రములను
త్రిప్పుచూ హొమము చేసిన అగ్నివలె కోపముతో మండి  పడెను
కోపించిన అతని నేత్రముల నుండి కన్నీటి బిందువులు రాల్చెను 
అవి వెలుగుచున్న దీపములనుండి నూనె బిందువులు రాలినట్లుండెను  

గొప్ప తేజస్సు గల ఆ రావణుడు హనుమంతుని పట్టు కొనుటకు తనతోను 
సమానులైన శూరులైన కింకరులను పేరుగల రాక్షసులను రావణుడు పంపెను 
వారు పెద్ద పెద్ద పొట్టలు, పొడవైన కోరలు భయంకరమైన ఆకారములతొ ఉండెను 
వారు కూటములు మద్గరములు అను ఆయుధములు ధరించి యుద్దమునకు వచ్చెను 


ఆ కింకరులు ముఖద్వారము వద్ద స్థిరముగా నిలచిన హనుమంతుని దగ్గరకు వచ్చెను 
మిడతలు అగ్నిలో పడినట్లుగా హనుమంతునిపై విరుచుకొని పడి  రాక్షసులు గదలతోను 
సూర్యుని వలె తీవ్రముగా ప్రజ్వ లించు భాణములతోను , పరిఘలతోడను
 బలవంతమైన ఎనభైవేల మంది కింకరులు హనుమంతునిపై యుద్దము నకువచ్చెను 


కింకరులు మద్గరములతోను పట్టిసములతోను, ప్రాసలతోను, గదలతోను 
శక్తులను ధరించి వెంటనే హనుమంతుని చుట్టుముట్టి అతని ఎదుట నిలబడెను   
గొప్ప తేజస్సు, సోభగల పర్వత సమానుడైన హనుమంతుడు ఆ రాక్షస కింకరులను 
చూదగానె తోక నేలపై కొట్టి గొప్ప భీకర శబ్దము కలుగునట్లు ధ్వని చేసెను

సర్వ సిద్ధి కొరకు ఈ నాలుగు శ్లోకములను నర్గాంతమందు చదువవలెను

జయ త్వతిబలో రామో లక్షణ శ్చ మహాబల:!
రాజా జయతి సుగ్రీవో  రాఘవేణా భిపాలిత: !!

దాసోహం కోసలేంద్రస్య రామ స్యా క్లిష్ట కర్మణ:!
హనుమాజ్ఞ్చాత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ:!! 

న రావణ సహస్రమ్  మే యుద్ధె  ప్రతిబలమ్ భవేత్ !
సిలాభి స్తు ప్రహరత: పాదపై శ్చ సహస్రశ:!! 

అర్ధయిత్వా పురీమ్ లంకా మభివాద్య చ మైధిలీమ్ !
సమృద్దార్దో  గమిష్యామి మిషతాం సర్వ రక్షసామ్ !!

భావం
అక్కడ వచ్చిన కింకరులతో హనుమంతుడు ఈ విధముగా ఉద్ఘోషించెను
అత్యంత బల సంపన్నుడగు రామునికి, మహాబలుడగు లక్ష్మణునికి, రాఘవునిచే రక్షింప బడిన సుగ్రీవునికి, జయమగుగాక
 నేను అనాయాసముగా తన కర్మలను నిర్వహించు శ్రీరామ చంద్రునికి దాసుడను,  పవనుని పుత్రుడనగు హనుమంతుడను, శత్రుసైన్యమును హతమార్చెదను యుద్దములో శిలలతోను వేలకొలది వృక్షములతోను ప్రహారము చేయు  నాకు వేయి మంది రావణులైనను ధీటుగారు.  నేను లంకను నాశసనము చేసి, మైధిలికి అభివాదము చేసి, రాక్షుసు లందరూ చూచు చుండగా, క్రుతక్రుత్సుడనై,  తిరిగి పోయెదను.  అంటూ పెద్ద గా గర్జన చేసెను.  అతని యొక్క గర్జన శబ్దమును విని రాక్షసు లందరూ భయబ్రాన్తులై సంద్యాకాలం మేఘమును బోలిన  హనుమంతుని చూసిరి.
 
అతని తోకను భూమిపై కొట్టిన మహోత్తరమైన శబ్ధము నాల్గు దిక్కులను
ప్రతిద్వానిమ్చాగా పక్షులు ఆకాశమునుండి క్రిందకు పడిపోయెను, పెద్దగా ఘోష చేసెను 

   హనుమంతుడు సింహ ద్వారమునకు సంభందించిన పెద్ద గుదియను తీసుకొనెను 
సూరులైన ఆ రాక్షసులందరూ  చుట్టు ముట్టగానే హనుమంతుడు  తన శక్తిని వార్కి చూపెను 


గరుత్మంతుడు ముక్కుతో సర్పములను గరహించినట్లును 
రాక్షసులను చేతిలోనికి తీసుకొని నలుపుతూ చంపి వేసెను
మహవీరులైన కంకరులను వీరులైన రాక్షసులను సంహరించెను 
హనుమంతుడు యుద్దముచేయుతకు సన్నద్ధుడై మరలా ఆ ముఖద్వారము వద్ద నిలిచెను   


కొందరు రాక్షసులు రావణుని వద్దకు పోయి కిన్కరులందరూ చనిపోయి నట్లుచెప్పెను
రాక్షసులయోక్క విశాలమైన సేన అంతయు నిహితుమైనట్లు విని కోపము తెచ్చుకొనెను 
రావణుడు కన్నులు త్రిప్పుతూ యుద్దమున అప్రతిమ పరాక్రము దుర్జయుడును 
నాగు ప్రహస్తునియోక్క పుత్రుడ్ని యుద్దము చేయుటకు  పొమ్మని ఆజ్ఞాపించెను 

శ్రీ సుందర కాండము నందు 42వ సర్గ సమాప్తము
 




ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (41వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
      శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


 41వ సర్గ (వాల్మికి రామాయణములోని 21శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుడు ఉద్యాన వనమును ధ్వంసము చేయుట )



తిరిగి వెళ్ళుటకు సిద్ధముగా గా ఉన్న మారుతిని సీత మంచి మాటలతో ఆదరించెను
పిదప హనుమంతుడు కొంత దూరము వెళ్లి ఇట్లు ఆలోచించెను 
నేను చేయవలసిన పని ఇంకా ఉన్నది, సీతను చూచినాను, సీతా సందేసము విన్నాను 
ఇక ఇక్కడ సామ,దాన, భేదలను విడిచిపెట్టి దండో పాయమునె ప్రయోగించవలెను


సామో పాయము గుణ కారిగా ఉండదు రాక్షసుల విషయమునందును 
దానము కూడా ఉపయోగ పడదు ధనవంతుల విషయము నందును
భెదనీతి కూడా  పనిచేయదు బలదర్పముగల వారి విషయము నందును
నాకు ఒక్కటే సంజసమనిపించు చున్నది ప్రయోగించాలి బల పరాక్రమములను


ఈ పరిస్తితిలో నేను పరాక్రమమును చూపుట తప్ప వేరొక మార్గము లేదును 
యుద్దమునందు కొంత మంది వీరులను హతమార్చిన రాక్షసులు 
మెత్తబడును
ఏదైనా ఒక కార్యము చేయవలనని ఆజ్ఞాపించినప్పుడు దానికి విరోధము కలుగకుండగాను
ఇతరములైన అనేక కార్యములను కూడా ఎవరు సాదించునో అతడే సమర్దుడును 


ఒకే ఉపాయము వుండదు ఎంత చిన్న కార్యము నకైనను 
దానిని సాధించుటకు అనేక ఉపాయములు ఉండ వచ్చును 
ఒక కార్యమును సాధించుటకు అనేక ఉపాయములు ఎవరికీ తెలియునో 
అతడే అన్ని కార్యములు సాధించుటకు సమర్ధుడై యుండెను  


ఇక్కడ నేను శత్రుమర్ధన రహస్యములను నెరిగి జరగబోవు కార్యము నందును 
ఒక నిశ్చయమునకు వచ్చి ఆ తరువాత సుగ్రీవనగరమునకు వెల్లెదను
అప్పుడే నా ప్రభువు ఆజ్ఞను ఖచ్చితంగా నిర్వహించిన వాడినగుదును 
ఆరావణుడు నన్ను ఎట్లు గౌరవించ గలడొ ముందుగా తెలుసు 
కొనగలను 


నాయొక్క ఈ రాక సుఖప్రద మెట్లు కాగలుగును
 రాక్షసులలో కూడా హటాత్తుగా యుద్దము ఎట్లు సంభవించును 
రావణుని మంత్రులను, అనుచరులను, సైన్యమును 
ఎదుర్కొని అతనిమనస్సున ఎమిఉన్నదో తెలిసి కొనవలెను 


రావణుని మతమేమో బలమేమో తెలుసుకొని ఇక్కడ నుండి సుఖముగా తిరిగి వెల్లెదను
క్రూరుడైన రావణుని ఉత్తమమైన ఉద్యానవనము అనేక విధములైన వృక్షములతోను లతలతోను
ఉన్న వనము నెత్రములను, మనస్సును, ఆకర్షించు నందనవనము వలెఉండెను
అగుఈ అశోక వనమును ఎండిన అడవి అగ్ని కాల్చినట్లు నేను 
ధ్వంసము చేసెదను


ఈ వనము భస్మము కాగా రావణునికి నాపై కోపము రాగలుగును
అటుపిమ్మట రావణుడు,అశ్వములతోను ఏనుగులతోను రధములతోను
 ఆయుధములు ధరించిన పెద్దసేనను తీసుకొని నాపై రాగలుగును
అప్పుడు ఇక్కడగోప్ప భయంకరమైన యుద్దము జరుగ గలుగును


నేనుగూడ యుద్దమున ప్రచండ పరాక్రమము గల రాక్షసులను
డీ కొని భంగమోందని పరాక్రమముగల వాడనై ప్రవర్తించెదను
రావణుడు నాపైక పంపిన సేనను హతమార్చి ఇక్కడ నుండి సుఖముగా పోగలుగుతాను
హనుమంతుడు అలోచించి పరాక్రమముతో విజ్రుంభించాలని అనుకొనెను 


మారుతి వృక్షములను వాయువు విరిచినట్లు విరుచుట ప్రారంభించెను 
మారుతి పరాక్రమమునకు పక్షులు ధ్వనులు చేయుచు ఆకుల్లారాలు చుండెను 
వనములోని లతా గృహములను,చిత్రగృహములను నశిమ్పచేసెను
ఈ విధముగా లతలతోను, వృక్షములతోను నిండియున్న అశోక వనమును భాగ్నమోనర్చెను


ఆ ఉద్యానవనములో అనేకములైన పక్షులు అరుపులు ప్రారంభించెను 
అక్కడ చెరువులు తెగి వృక్షములు లతలు కలసి భయంకరంగా ఉండెను
 ఆధారముగా ఉన్న స్థంబములు చెట్లు అక్కడ అగ్నికి దహించినట్లుగా మారెను 
దుఖకాంతలైన స్త్రీలు పడినట్లుగా వనములోని చెట్లన్నీ పడిపోయెను 


మహాసర్పములను, ఇతర క్రూరమృగములను ఎగరగోట్టెను
రాతిగ్రుహములు ఇతరగ్రుహములు అరుగులు పగల గొట్టెను
అందువలన తనతొల్లిటి రూపమును కోల్పోయి పూర్తిగా నాశనమాయెను
రావణుని స్త్రీలకు ఆనందము కల్గించు ఉద్యానవనము నాశన మయ్యెను 


పేక్కు మంది మహాబలాడ్యులతో స్వచ్చందముగా ఒక్కడే యుద్దమును
 చేయుకోరికతో ఆమహావానరుడు జగత్పతియును మహాత్ముడును 
నగు రావణునియోక్క మనస్సునకు కష్టమును కల్గించు కార్యమును
చేసి అద్భుతమైన శోభతో వేలుగొందుచూ సింహద్వారముపై నుండెను

శ్రీ సుందరకాండము నందు 41వ సర్గ సమాప్తము

Friday, 24 July 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (40వ సర్గ)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
      శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:


 40వ సర్గ (వాల్మికి రామాయణములోని 25శ్లోకాల  తెలుగు వచస్సు)
("సీత రామునకు మరలా సందేసము ఇచ్చుట.  హనుమంతుడు ఆమెను ఓదార్చి ఉత్తర దిక్కువైపు ప్రయాణ మగుట)


సీతాదేవి మహాత్ముడైన హనుమంతునియోక్క అమృత వచనములు వినెను 
దెవకన్యతో సమానురాలైన ఆమె హితమైన వాక్యములు మరలా పల్కెను 
 సగము మాత్రమె నాటుకొనిన సస్యముగల భూమి వర్షము పడగానే వికసించి నట్లును   
మంచి మాటలు చెప్పుచున్నావు హనుమంతుడా నిన్ను చూసి నేను సంతోషించు చున్నాను 
దుఖముచేత కృశించిన అవయవములతొ నేను ఆ రామున్ని స్ప్రుశించవలెను 
అనే కోరిక ఉన్నది. నా పై దయ వుంచి ఆ కోరిక సఫలమగునట్లుగా నీవు చేయవలెను 
కోపముతో కాకిపై  బ్రహ్మాస్త్రమును వేసిన విషయమును గుర్తు చేయవలెను 
నేను నీకు చెప్పిన విషయాలు చూడామణిని ఆనవాలుగా చూపవలెను
రామా ఒకనాడు నేను నీతొ కలసుకున్నప్పుడు నా నుదుట తిలకము చెరిగి పోయెను 
నీ చేతితో మనస్సిలాతిలకము నున్చినట్లు గుర్తుకు తెచ్చుకోమని చెప్పవలెను 
పరాక్రమవంతుడువు మహేంద్ర వరునులతో సమానుడవు అయినను
హనుమా రాక్షసలమద్య ఉన్న నన్ను ఉపేక్షిమ్చుటకు కారణము అడుగ వలెను  


ఓ రామ ఈ దివ్యచూడామణిని చాలా జాగర్తగా కాపాడుకొను చున్నాను
ఈ దుఖములో దీనిని చూసుకొనుచు నిన్ను చూసినట్లు సంతోషించు చున్నాను   
జలములో పుట్టిన సోభాయుకమైన ఈ చూడామణిని నీకుపంపు చున్నాను  
శోకముతో వ్యాకులరాలునైయి నేను ఈ లంకలో ఇక జీవించ జాలను


నీవు ఏనాటికైనా రాక పోదువా అని ఆశతో భరింపరాని కష్టములను 
చాల భయంకరమైన రాక్షస స్త్రీల మాటలను నేను సహించు చున్నాను 
శత్రునాశకుడైన రామా నేను ఒక్క మాసము మాత్రమె ఇక్కడ జీవించగలను
ఈ రావణుడు చాలా క్రూరుడు అటుపై నీవు రాకపోతే నేను జీవించ లేను
  

 రావణ దృష్టి కూడా నావిషయమున సరిగా ఉండుట లేదును
నీవు కూడా ఆలస్యము చేసినట్లు వినినపిదప క్షణమైన జీవించజాలను
 సీతాదెవి యొక్క కన్నీటితో ఈకరుణ మయమగు ప్రసంగమును 
 విని మహాతేజస్వి అగు మారుతాత్మజుడ హనుమంతుడు ఇట్లు పలికెను 


సీతాదేవి రాముడు నీయొక్క శోకము మూలమున అన్నీ కార్యముల లోను విముఖతను 
 చూపుచున్నాడు సత్యముపై శపధము చేసి నెనీవిషయమును చెప్పుచున్నాను
రాముడు శొకాభిభూతుడు కాగా లక్ష్మణుడు మిక్కిలి పరితాపము చెందుచుండెను
ఎట్లో అతికష్టముమీద నీవు కన్పించితివి దుఖమును ఇక విడువవలెను


 నిర్దోషురాలా రామునకు తెలిసినదియును ప్రీతి కల్గించే గురుతు           ఏదైనా ఇవ్వవలెను 
అపుడామె ఇట్లు పల్కేను నీకు ఉత్తమమైన చూడా మణిని ఇచ్చి యున్నాను 
హనుమా ఆ ఆభరణమును చూసి నీ మాటలు రాముడు విశ్వసించ గలుగును
ఆ ప్లవ సత్తముడు చూడామణిని గ్రహించి శ్రిరస్సుతో ప్రణమిల్లి వెళ్ళుటకు సిద్దపడెను 


అక్కడ నుండి ఎగిరిపోవుటకై శరీరమును పెంచ సాగేను 
మహావేగా సంపన్నుడు ఉత్సాహవంతుడగు వానరుడను 
చూసి కన్నుల నిండా నీరు తెచ్చుకొని ధీనురాలగు సీత ఇట్లు పలికెను 
 హనుమా రామలక్ష్మణులకు  సుగ్రీవునకు వానరులకు నా కుశల వార్తను తెలుపవలెను 


ఈ ధుఖసాగరము నుండి దాటిన్చగలవో అట్లే చెప్పవలెను
రాక్షస స్త్రీలు భయపెట్టుచున్నారని రామునకు చెప్పవలెను 
హనుమంతుడు హర్షముతో నిండి అంతరంగము కలవాడై క్రుతార్దుడైనాట్లు తలచి తాను
చేయకుండగా నున్న కార్యమును గూర్చి మనస్సులో విచారించి అక్కడ నుండి ఉత్తర దిక్కుకు బయలుదేరెను 

శ్రీ సుందర కాండము నందు 40 వ సర్గ సమాప్తము  
                                                        
                                                                                                                                                                                                                                                                                                                        

Wednesday, 22 July 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (39వ సర్గ)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
      శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:

 38వ సర్గ (వాల్మికి రామాయణములోని 54 శ్లోకాల  తెలుగు వచస్సు)
("చూడామణిని తీసుకొని తిరుగు ప్రయాణము చేయుటకు సిద్దమగు చున్న హనుమంతునితో సీత శ్రీ రామాదులను ప్రోత్సహించవలెనని చెప్పుచూ, వారందరూ సముద్రమును ఎట్లు లంఘిన్చగలరో అను సంశయమును వ్యక్తము చేయగా హనుమంతుడు వానరుల పరాక్రమమును వర్ణించి చెప్పి ఆమెను ఊరడించుట    

సీతాదేవి ఆ చూడామణి  ఇచ్చి హనుమంతునితో ఈ విదంగా పల్కెను 
నా ఈ అభిజ్ఞాణమును శ్రీ రామచంద్రుడు చక్కగా నెరుగును
ఈ మణిని చూచిన రాముడు నాతల్లిని, నన్ను, దశరధమహరాజును 
ముగ్గురిని ఒక్కసారిగా గుర్తుకు తెచ్చుకొని స్మరించ గలుగును 


ఓ కపిశ్రేష్ట విశేషోత్సాహముచే ప్రేరితుడవైన నీవు ఈకార్యమును
ప్రేరేపించుటలో ముందుచేయవలసిన పనిని గూర్చి ఆలోచిన్చవలెను 
ఓ హరిసత్తమా ఈ కార్యమును నిర్వహించుటలో నీవే సమర్దుడవును
ఏమి చేసినా ఈ దుఃఖము పోవునో నీవు అట్లే అలోచించి చేయవలెను



ఓ హనమంతుడా నీవు గట్టి ప్ప్రయత్నమును చేచేసి నా దు:ఖమును పోగొట్టు విషయమునను
వివరించుము రామునకు అనగా అట్లే అని ప్రతిజ్ఞచేసి ఆ సీతకు చేసే  శిరస్సుతో  ప్రణామమును
వెనుతిరుగు సమయమున సీత బాష్పగద్గదమైన స్వరముతో హనుమంతునితో ఇట్లు  పల్కెను
ఓ పవన పుత్రా రామలక్ష్మణులకు నాక్షేమమును తెలిపి వారిని కుశల మడిగినట్లు చెప్పవలెను


ఓ కపిశ్రేష్టా అమాత్యసహితముగా సుగ్రీవునకును
ఇతర  బల్లూక వానర మహా వీరు లందరకును
ధర్మమూ తప్పక కుశలవార్తలు చెప్ప వలెను
శ్రీరాముడు నన్ను ఎట్లు ఉద్దరిమ్పగలడో  అట్లే నీవు చెప్పవలెను


ఓ హనుమా కీర్తిమన్తుడగు శ్రీ రాముడు నేను
జీవించి యుండగా  ఇక్కడకు వచ్చినన్ను సంభావనను 
చేయునట్లు నీవు శ్రీ రామచంద్రునకు తెలియ పరుచవలెను
ఇంట మాత్రము వాక్సహయము చేసి పుణ్యము కట్టుకొనవలెను


ఉస్చాహ యుక్తు డైన శ్రీ రామచంద్రునికి ణా పలుకులను
విని నన్ను పొందుటకు నిత్యము పౌరుషము వృద్ధి పొందును 
వీరుడైన రాఘవుడు ప్రేమతో ణా సందేశముల వచనములను
నీ వలన విని తప్పక పరాక్ర మించుటకు సంకల్పించగలుగును


సీత యొక్క వాక్కులు విని మారుతి శిరస్సున అంజలి ఘటించి ఇట్లు బదులు పల్కేను
ఓ దేవీ వెంటనే శ్రీ రామచంద్రుడు భల్లూక వానర వీరులను వెంట నిడుకొని రాగలుగును
యుద్ధమున శత్రువులన్దరిని జయించి నీశోకము పోగొట్టి అయోధ్యకు తీసుకొని వెల్ల గలుగును
రాముని భాణములు ప్రయోగించు చుండగా ఎదుట యుద్ధము చేయువారు కనబడకుండును




ఓ సీతా యుద్దరంగాములో సూర్యున్నయినను ఇంద్రున్నయినను
          సూర్యకుమారుడైన యముడినైనను ఎదిరించగల సమర్దుడును 

సాగర పర్యంతము వ్యాపించియున్న ఈ భూమిని సాదిమ్పగలవాడును
ఓ సీతా రాముడు నీ కొరకు యుద్దమున తప్పక జయము కల్గును 


హనుమంతుని యోక్క సత్యమును సుందరమును నగు భాషితమును
విని జానకి అతనివచనమును మిక్కిలి గౌరవిన్చుచు అతనితో ఇట్లనెను
ప్రయానోద్యుడైన హనుమంతుని మాటి మాటికి జూచుచు తన భర్తను
గూర్చి ప్రేమ పూరితమైన స్నెహపూర్వకముగా మారుతితో పలుకులు పలికెను


శత్రునాశకుడైన ఓ మహవీర ఉచితమని తలచినను 
ఎక్కడో ఒక గుప్తప్రదేశమున ఉండి విశ్రాంతి తీసుకొని వెళ్ళవలెను
రేపు వెల్లువుదువు గాక వానరా, నీ సమీపమున నేనున్నాను 
మందభాగ్యనైన నాకు ఈ మహోత్తరమైన శోకము ముహూర్తకాలమైన లేకుండును 


ఓ కపివర నీవు కనుపింపక పోవుట వలన నాకు శోకము పెరుగును
మరియొక దుఃఖముతో భాదపడు నన్ను ఇంకను శోకము తపింప చేయును
ఓ వానర నీకు సహాయకులుగా కపిభల్లూకములు కడలిదాటి ఎట్లు రాగాలగును ?
సందేహముగా ఉన్నది రామలక్ష్మణులు కడలి దాటి ఎట్లు రాగాలుగును


 గరుత్మంతుడు నీవు వాయుదేవుడు ఈ ముగ్గురుమాత్రమే కడలిని దాట గలుగును?
ఓ వీరుడా కార్యసాదనలో నిపునుడవగు చెప్పుము అందరూ కడలిని ఎట్లు దాట గలుగును?
ఇట్టిస్తితిలో నీవేమి ఉపాయము ఆలో చించితివి కార్యము ఎట్లు సాధించ గలవో చెప్పవలెను?
శత్రువీరులను నశిమ్పచెయు ఓ వీరా నీ ఉద్దేస్యము వివరముగా తెలుపవలెను


ఓ శత్రు సంహారకా నీ వోక్కడివే ఈ కార్యమును సాదింపగల
 సామర్దుడవును
కాని దీని వలన ఫలము యశస్సు నీకే  పూర్తిగా లభిమ్పగలుగును
శ్రీ రాముడు యుద్దములో రావణుని సకలసేనలను ఓడించిన తర్వాతను 
 నన్ను తీసుకొని తన పట్టణమునకు వెళ్ళినచో  శ్రీ రామునికి తగి యుండును 


శత్రుసేనలను సంహరించి రాముడు లంకను భాణములతోను
 నింపి నన్ను తీసుకొని వెళ్ళినచో అది ఆయనకు దగినదైయుండును 
కావున నీవు మహాత్ముడును, యుద్దశూరుడును అగు రాముని 
పరాక్రమమును 
రాక్షసులపై యుద్ధం చూసే విధముగా నీప్రయత్నమ్ చేయవలెను 


ఓ దేవి వానర భల్లూక సేనలకు బ్రభువును, సత్య సంపన్నుడును
కపివరుడగు సుగ్రీవుడు నిన్ను ఉద్దరించుటకు కృతనిశ్చుడై యుండెను
ఓ వైదేహి రాక్షస వధకొరకు అతడు అర్బుదముగల వానర సైనికులను
తీసుకొని ఇక్కడకు రాగలుగును పెక్కు కపులు అతని ఆజ్ఞను పాలించు చుండెను 


మహావిక్రమ సమన్నులను, సత్య సంపన్నులను, మహా బలసాలురను
మనస్సంకల్ప వేగముతో సమానమైన వేగముగా యుద్దాలు చేయను 
మహోత్సాహ సంపన్నులైన వారు ఆకాశమార్గమున సంచారులను
పైకి గని, క్రిందకు గాని, అడ్డముగా గాని గమనము చేసే కపులుండెను 


ఓ సీతా వారిలో నాకంటే గొప్పవారు నాతొ సమానులైనవరును 
సుగ్రీవుని వద్ద నా కన్నా తక్కువ వారెవ్వరూ లేరును 
ఓ సీతాదేవి నాకన్నా బలవంతులైన వారి మాట నేను ఎట్లా చెప్పగలను 
శ్రేష్టులను వార్తాహరులుగా పంపరు కదా? పంపుదురు కేవలము సామాన్యులను 


ఓ దేవి నీవు పరితాపము చెందకము విడిచి పెట్టుము దుఖమును
  వానర సేన నాయకు లందరూ ఒక్క దుముకులో లంకకు చేర గలుగును
ఉదఇంచిన సూర్య చంద్రుల వాలే రామలక్ష్మణులు ఇక్కడకు రాగాలుగును 
గోపబాలముగల రామలక్షమనులు నా భుజముపై నెక్కి ఇక్కడకు రాగాలుగును


వానరులు, భల్లూకాలు, రామలక్ష్మణులు  యుద్దములోను
వారి ప్రతాపము చూపి లంకా నగరమును నాశనము చేయును 
రాఘవుడు రావణున్ని చంపి నిన్ను తీసుకొని తిరిగి వెల్లగలుగును
నీవు ఊరడిల్లుము, నీకు క్షేమమగు గాక కాలమునకు వేచి యుండవలెను 


రాక్షసరాజు పుత్రులతోను, అమాత్యులతోను, భందువులతోను
చంపినా పిదప రోహినిని చంద్రుడు కలసినట్లు నీవు కలవగాలవు రామునితోను 
నీవు సంతోషముగా ఉండుము సీఘ్రముగా అంతము చూదగలవు శోకమును 
అచిరకాలములో సంతోష వార్తలను నీవు తప్పక వినగలవును


ఈవిధముగా పవననందనుడు వైదేహిని ఓదార్చెను 
తిరుగువేల్లుటకు నిశ్చఇంచి సీతతొ మరలా ఇట్లు పలికెను
శత్రుసంహారకులైన రాముడు లక్ష్మణుడు ధనస్సులను ధరించియును  
లంకానగరము వద్దకువచ్చుట వారిని సీఘ్రముగ చూడ గలవును 


నఖములు కోరలు ఆయుధములు కలవారును
వీరులు సింహ శార్దూలమువలె విక్రమ సంపన్నులును
పర్వతములను మేఘములను చీల్చిన వారును 
గజేంద్ర తుల్యులను అగు వానరులు కలసి రాగలుగును


పెక్కు ఆయుధములు ధరించి గర్జించు కపిముఖ్యులను
లంకలో మలయా పర్వతముల శిఖరముపై చూడగలవును
శ్రీరాముడు ఘోరమైన కామ భాణములతో పీడితుడుగాను
సింహ పీడిత మైన గజము వలే శాంతిని కోల్పోయి యుండెను


ఓ దేవి శోకింపకము నీకు శోకము వలన భయము ఏర్పడును 
శచీదేవి ఇంద్రుని కలసినట్లుగా నీవు కుడా నీ భర్తను కలుసుకొన గలుగును 
ఎవ్వరూ లేరు రామునికంటే గోప్పవారును,సౌమిత్రునితో సమానమగు వారును 
నీ కేమి భయ్యము? అగ్నివయువులతో సమానులైన సోదరులు  ఇక్కడకు వచ్చును


ఓ ఆర్యురాలా రాక్షసుల మద్య చిరకాలము ఇక్కడ ఉండవును 
నేనుకలియుతడవుగానే నీభర్త ఇక్కడకు రాగాలుగును 
ఆమత్రము ఆలస్యమును మీరు ఒపికతో సహిమ్చవలెను
అని ప్రణామాలు అర్పిస్తూ హనుమంతుడు సీతతొ పలికెను

శ్రీ సుందర కాండ నందు 39 వ సర్గ సమాప్తము  

Monday, 13 July 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (38వ సర్గ)


ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
      శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:
 38వ సర్గ (వాల్మికి రామాయణములోని 73 శ్లోకాల  తెలుగు వచస్సు)
("సీత హనుమంతునకు చిత్రకూటముపై జరిగిన కాకవృత్తాంతమును   గూర్చి చెప్పి, రామునకు నమ్మిక కలుగుటకై హనుమంతునకు చూడా మణి ని ఇచ్చుట ")


అటు  పిమ్మట ఆ కపి శ్రేష్టుడు సీత పాల్కులు విని సంతోషించెను 
మాటలలో నేర్పరి అయిన హనుమంతుడు ఆమె మాటలు విని ఇట్లనెను 
శుభదర్శనయగు ఓ దేవి ? నీ పాలకులు చాలా యుక్తి యుక్తముగను
అగు స్త్రీ ప్రకృతికి తగినదిగను పతివ్రతకు అనురూపముగా నుండెను


నీవు స్త్రీ వి గనుక నన్ను  అధిరోహించి శతయోజన విస్తారమగు కడలి దాటుటను
కష్టము నీవు చెప్పిన రెండవ కారణము రామునికంటే వేరైనా వాని సంస్పర్శను చేయను
అనునది కుడా మిక్కిలి యుక్తము శ్రీరామ చంద్రుని యొక్క భార్య వగు నీవట్లనుటను  
   నీకు మిక్కిలి తగియున్నది. ఓ దేవి నీవు తప్ప మరిఎవ్వరు ఇట్లు పలుక కలుగును?


ఓ దేవి నీవు ఏ  విధముగా ప్రవర్తించి నావో, నీయొక్క సమస్త  చేషితమును 
నా యెదుట నీవు మాటలాడిన అన్ని మాటలను సమ్పూర్ణముగా  తెలుపగలను 
ఓ సీతాదేవి అనేక కారణములు ఉండుటచేతను రామునకు ప్రియము చేయట వలనను 
ఇచ్ఛ చేతను, స్నేహముచేతను, నీ భాదను చూసి నామనసు కరిగి నేనట్లు చెప్పినాను


లంక ఎదిరింప శక్యము కానిది, మహాసముద్రము దాటుట చాలా కష్టమును 
నాకు నిన్ను తీసుకొని పోవుటకు తగిన సామర్ద్యము కూడా  ఉన్నదియును 
ఈ అన్నీ  కారణములు దృష్టిలో వుంచుకొని నేనట్లు చెప్పినాను 
మీ విషయమున స్నేహము చేతను, భక్తిచేతను, రామునివద్దకు చేర్చాలని కోరికతో పలికినాను 


ఓ దేవి నీవు నాతొ వచ్చుటకు ఇష్టము లేనిచో ఆనవాలుగా ఏదైనా ఇవ్వ వలెను 
సీత హనుమంతుని మాటలు విని కన్నీటితో కూర్చిన మాటలుగా ఇట్లు పలికెను 
నీవు నా భర్తఅయిన  రామునితో ఇక్కడ నీవు చూసిన దంతయు  చెప్పవలెను 
నీవు నేను చెప్పా బోవు అభిజ్ఞానము గూర్చి నా ప్రియునికి తెలుప వలెను 


చిత్ర కూటపర్వతము యొక్క ఈ సాన్యభాగమున మందాకిని కి
 సమీపమున
ఫలమూల ఉదక ప్రాచుర్యముగల సిద్ద సేవితమైన దేశముగల 
ఋష్యాశ్రమమున
నివశించినపుడు నానా పుష్ప సౌగంద్యములతో నిండిన గాలి ఉన్న ప్రాంతమున 
విహరించి నీటితో తడిసి నీవు నా వడిలో కూర్చోని పొందావు సుఖమును 


అటుపిమ్మట ఒక కాకి వచ్చి నన్ను ముక్కుతొ పొడవసాగెను
నేను ఆకాకిని రాయి ఎత్తి నివారించుటకు ప్రయత్నిమ్చినాను
కానీ ఆ కాకి నన్ను పోడుచుచు అక్కడనే దాగు కొను చుండెను 
బలులను భుజించు ఆకాకి నామంసము తినకోరి పొడుచు చుండెను 


నేను ఆ పక్షిపై కోపించి నమొలసూలను సరిచేయుచుండగా నా చీర జారెను 
ఆ చీరను సరిచేసుకోను చుండగా నీవు చూసి నన్ను పరిహాసము చేసి నావును
ఆ కాకి ఆహరంకొరకై నన్ను చీరగా నేను నీ వద్దకు వచ్చి వడిలో కూర్చొని ఉన్నాను
అప్పుడు కోపముతో ఉన్న నీవు నవ్వుచు ఓ దార్చి వాయసముపై కోపించెను 


కాకి కోపాము కల్గించుటచే  నా కన్నుల వెంబడి అశ్రుబిందువులు జాలు వారెను
నా కన్నులను తుడుచుకోను చుండగా నీవు చూసితివి ఆసమయము నందును 
అలసట వలన నేను నీ అంకమున నిద్రించితిని, నా అంకమున తిరిగి నీవు నిద్రించెను 
నా అంకమున రాముడున్నప్పుడు ఆ కాకి సమీపించి నా వక్షముపై పొడిచెను


పదే  పదే  ఎగురుచు నన్ను అట్లే ఎక్కువగా ముక్కుతొ భాద పెట్ట సాగెను 
అప్పుడు రక్తబిందువులు రాలుచుండగా శ్రీ రాముడు నిద్రనుండి మేల్కాంచెను 
మహాభావువైన ఆ రాముడు స్తనములపై కాకిచే గీరగా ఏర్పడిన రక్తపు గీతలను 
చూచి కొప్పించిన సర్పమువలె బుసలు కొట్టుచు కోపముతో ఇట్లు పలికెను


గజముయోక్క తొండము వలే సుందరమైన ఊరువులను
చూచి నీ ఊరువులమద్య భాగమున నెవ్వరు గాయపరిచెను
కోపించిన ఐదు తలలుగల పన్నగముతో ఎవ్వడు క్రీడింప దలచెను
అంటూ రాముడు వాడిఅయిన గోళ్ళతో ఎదురగా ఉన్న వాయసమును చూసెను 


శ్రేష్టమైన ఆ కాకి దేవేంద్రుని పుత్రుడును 
స్వర్గ లోకమునందు విహరించు వాడును 
  వాయువుతో సమానమైన వేగంగలవాడును 
ఈ భూమండలములోనికి శీఘ్రముగా వచ్చెను 


మహాబాహువు బుద్దిమంతులలో శ్రేష్టుడును 
శ్రీ రాముడు కోపముచో నేత్రములు తిప్పెను 
కాకి విషయమున మిక్కిలి క్రూరముగా అలో చించెను
దర్భాసనమునుంది ఒక దర్బను తీసి భ్రహ్మ మంత్రమును  మంత్రించెను 


కాలాగ్నివలె ఆ వాయసమున కభిముఖముగా ప్రజ్వలించ సాగెను
అటుపిమ్మట శ్రీరాముడు ప్రదీప్తమైన ఆ దర్బను కాకిపై  విసెరెను
ఆ దర్బ ఆకాసము నందు కాకిని తరుము కొనుచు వెంబడించెను 
తన ప్రాణములు రక్షిమ్చుకొనుటకు లోకములన్ని  తిరగ సాగెను


తండ్రిచేతను, మహర్షులచేతను వాయసము  పరిత్యజింప పడెను
కాకి మూడులోకములు తిరిగి చివరకు శ్రీ రాముని శరణు  కోరెను
ఆ కాకిని చంప దగినదే అయిన శ్రీరాముడు జాలికొని రక్షించెను 
అలసిపోయి దుఖించు చున్న కాకిని చూసి శ్రీరాముడు ఇట్లనెను 


బ్రహ్మాస్త్రము వ్యర్ధము అగుట వీలు లేదు, ఏమి చేయవలెనో నీవె చెప్పవలెను 
నీ భాణముతో నా కుడి కన్నును పెకలించి తోసికొనమని శ్రీరాముని కోరెను 
శ్రీ రాముడు ప్రయోగించిన ఆ దర్భ ఆ కాకి కుడి కంటిని హింసించెను 
 ఈ విధముగా ఆ కాకి కుడికన్ను సమర్పించి ప్రాణనములను రక్షించు కొనెను


ఆ కాకి  రామునకూ, దశరధ మహారాజుకూ నమస్కారము చేసెను 
రాముని అనుజ్ఞ తీసుకొని తన నివాసమగు స్వర్గలోకముకు పోయెను 
ఓ రామ నా కొరకు ఆకాకి పై బ్రహ్మ అస్త్రమును ప్రయోగించి నావును
నన్ను అపహరించిన వానిని ఓ మహీపతి నీవెట్లా హింసించ కుండెను?  


ఓ పురుషోత్తమా నీవు నాపై నీవు మహొత్సాహము యుక్తముగా జూపుము దయను 
నీ వంటి సమర్దుడగు భర్త కల్గియున్న నేను అనాధ వలె కన్పటు చున్నాను 
నీవె నాకు చెప్పితివికదా 'దయ' ధర్మములలో కెల్ల ఉత్తమ ధర్మమను విషయమును 
నిన్ను మహావీర సంపన్నునిగను మహోత్సాహబలయుక్తునిగను నేనెరుగుదును


ఓ రామచంద్ర నివు గామ్భీర్యములొ సముద్రము వంటి వాడవును
సముద్రపర్యన్తముగల ధరణికి పతివి, ఇంద్రునకు సమానుడవును 
అస్త్ర విదులలో శ్రేష్టుడవు, సత్య బల పరాక్రమ  సంపన్ను డవును 
రాక్షసులపై నాకొరకు ఎందుకువలన ప్రయోగించావు అస్త్రములను ?



రాక్షసులనేలా నాశమొనర్చడు? హృదయమున నాగురించి వ్యాకులత యున్నను
లక్ష్మనుడైన సోదరుని ఆజ్ఞ తీసుకొని నన్నెలా  రక్షింపడు ? వీరుడైన సోదరుడును
నన్నెలా ఉపేక్షిమ్చు చున్నారు?  ఇంద్రునితో సమానము లైన రామ లక్ష్మణులును
నన్నుఎలామరచినారు? దేవతలనుకూడా లొంగ దీయగల శత్రు తాపసు లిద్దరును

 

నేనే ఏదో గొప్ప  మహా పాపము చేసి యున్నాను
సందేహము లేదు సమర్ధులై  యుండి కూడాను
శత్రుపీడకులైన ఆరామలక్ష్మణులు నన్నుమరిచెను
సీత కన్నీరు కార్చుచూ దీనముగా ఇట్లు పలికెను 



సీత మాటలకు ఓ దేవి నేను సత్యముపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను
శ్రీ రాముడు నీ యొక్క శోకము వలన అన్యకార్యవిముఖుడై యుండెను 
శ్రీ రాముడు దు:ఖపడుటనుచూసి లక్ష్మణుడు కూడా దుఖపడు చెండెను
ఎట్లో అతి కష్టంమీద నీన్నుగుర్తించాను, నీవుదుఖంచ నవసరము లేదును 



స్వల్ప కాలములో నీవు దు:ఖముల అంతమును చూడ గలవును
బలశాలులైన రాజపుత్రులిద్దరూ నిన్ను చూడాలని కోరికతో యుండెను
ఓ విశాలక్ష్మి నీకొరకు లోకములను భస్మముచేయగల వారై యుండెను
రావణుని సంహరించి రాఘవుడు నిన్ను అయోధ్యకు తీసుకు వెల్లగలుగును


ఓ సీతా నీ ప్రియ శ్రీ రామునకు ఏమి చెప్పవలెను
మహా బలసంపన్నుడగు లక్ష్మణునకు ఏమి చెప్పవలెను
పరాక్రమ వంతుడగు సుగ్రీవునకు ఏమి చెప్ప వలెను
భల్లూక వనరులకు ఏమిచేప్పవలేనో చెప్పమని కోరెను


హనుమంతుని మాటలకు శోక పీడిత ఐన సీత ఇట్లు పల్కేను
ఓ కపిశ్రేష్టా మనస్విని యగు కౌసల్యా  దేవి ఎవ్వనిని గనెనో
అతనికి తలవంచి నమస్కారము చేసితినని చెప్పవలెను
నా పక్షమున అతని క్షెమసమాచారములను అడుగవలెను


సుమిత్రా పుత్రుడైన లక్ష్మణుడు ఉత్తమములైన భోగవస్తువులను
పువ్వులను ప్రియమైన ఉత్తమస్త్రీలను మహోత్కృష్ట మైన సుఖమును
శ్రీరాముని అనుకూల్యమూలమున అతనిని రక్షించుటకై వెంట నుండెను
తల్లితండ్రుల అనుమతితో రామునికి తోడుగా ఉన్న లక్ష్మణుని కుశలమడగవలెను


రాముని పట్ల తండ్రి వలెను, నాపట్ల తల్లి వలెను వెలుగు చుండు వాడును
అగు లక్ష్మణుడు, వీరుడు, వృద్ధసేవకుడు, లక్ష్మీసంపన్నుడు, మితభాషియును
శక్తియుక్తుడు, మ్రుదుస్వభావముగలవాడు నన్ను అపహరించినట్లు తెలియకుండును
నాకంటే గూదా సోదరుడగు లక్ష్మణుడు శ్రీ రామ చంద్రునకు మిక్కిలి ప్రియుడును

            
లక్ష్మణుడు కార్యబారమున నియుక్తుడైన చక్కగా నిర్వహించును
లక్ష్మణున్ని జూచిన శ్రీరాముడు తనమిత్రుడైన తండ్రిని మరచిపోవును
మృధుస్వభావముగలవాడు సదా పవిత్రుడు శుద్ధుడు సమర్దుడును
రామునికి ప్రియ స్నేహితుడైన  వానరశ్రెష్టుడిని కుశలమడగ వలెను 



ఓ వానర యూధపా నీవు ఈ కార్యము ఎట్లు నిర్వహింపబడునో అట్లే చేయవలెను 
దీనికి నీవే  ప్రమాణము రాఘవుడు నా విషయమై  ప్రయత్నశీలుడగు నట్లును             
పదే  పదే  నా కష్టమును నాభార్తయగు శ్రీ రామునికి అన్నియు  తెలుప వలును 
దాశరధికి నేను ఒక నేలమాత్రమే జీవించగలనని పిదప జీవించనని చెప్పవలెను 


నేను సత్యమును చెప్పుచున్నాను, రావణునిచే బందింప బడినదానను
 పాతాళమునుండి ఇంద్రుని లక్ష్మిని రక్షించినట్లుగా నీవు రక్షించ వలెను
పిమ్మటసీతకొంగులో ముడిపెట్టివున్నచూడామణిని మారుతికి ఇచ్చెను
దీనిని రామునికి ఇమ్ము అని చెప్పుచూ హానుమంతునకు ఇచ్చెను 


వీరుడైన హనుమంతుడు ఆ సర్వోత్తమమైన మణిని గ్రహించి తన వ్రేలికి పెట్టుకొనెను 
కాని అతడు వ్రేలికి తోడుగలేక పోయెను ఆమనిరత్నము తీసుకొని నమస్కరించెను 
ఆమె చుట్టూ ప్రదక్షణ చేసి ప్రణామాచరించి ఆమె ప్రక్కనే అనుమతికోసం  నిలబడెను 
హనుమంతుడు సీత దర్శనము లభించినందుకు సంభాషించినందుకు సంతోషించెను 


మనస్సులో రామునివద్దకు వెళ్లి పోయెను మారుతి శరీరము మాత్రము ఇక్కడే ఉండెను 
జానకిచే నిజ ప్రభావమున ధరింప బడి మిక్కిలి ఉత్తమమైన మణి శ్రేష్టమును 
గ్రహించగానే హనుమంతుని శరీరము గాలిచే కదల్చి వేయబడిన చెట్ల వలె వనికెను
మనస్సులో మిక్కిలి సంతోషము పొంది తిరిగి వెళ్లి పోవుటకు ప్రయత్నించెను


 శ్రీ సుందరకాండము నందు 38 వ సర్గ సమాప్తము