Tuesday, 23 June 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (35వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం రాం
          శ్రీ మాత్రే నమ:
      శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:




http://vocaroo.com/i/s0Es4DmmVH56
 35వ సర్గ (వాల్మికి రామాయణములోని 80 శ్లోకాల  తెలుగు వచస్సు)
("సీత కోరికను అనుసరించి హనుమంతుడు రాముని శరీర 
లక్షణములను,  గుణములను, వర్ణించి  చెప్పి నర-వానరుల మైత్రి ఎట్లు జరిగెనో చెప్పి ఆమెకు తనపై విశ్వాసము కలుగునట్లు చేయుట ")    


హనుమంతుడు తెలియపరిచిన రామ సంభందమైన కధామృత వచనాలను 
విని సీతాదేవి మధురమైన వాక్కుతో కొన్ని శాంత్య వచనములు పలికెను 
హనుమా నీకు రామునితో గల సంభందము ఎక్కడ ఎప్పుడు ఎట్లు ఏర్పడెను
లక్ష్మణుని ఎరుగుదువు కదా, వానరులకు- నరులకు సమాగమము ఎట్లు కలిగెను


ఓ వానరా రామునికిని లక్ష్మణునికిని గల గురుతులను తెలుపవలెను
అతని ఆకృతి అతని రూపము ఎట్టిదో  విన్న నాకు శోకము తగ్గును
వారిరివురి భాహువులు,ఊరువులు మొదలగు వానిని గూర్చి తెలుపవలెను
హనుమంతుడు సీత మాటలు విని రాముని గూర్చి ఉన్నది ఉన్నట్లుగా వర్ణించుటకు ఉపక్రమించెను


ఓ వైదేహి నా అదృష్టముచే నీకు తెలిసి ఉండి కూడాను
నీ భర్త అయిన రాముని ఆకారమును, లలక్ష్మణుని ఆకారమును 
గూర్చి అడుగు చున్నావు నాకు చాలా సంతోషముగా ఉండెను 
ఓ విశాలాక్షి నేను గుర్తించిన రాముని లక్షణములను తెలిపెదను 


సీతా రాముని  పద్మముల రేకులవలె విశాల మైనవియును
సమస్తమైన ప్రాణుల మనస్సును ఆకర్షించు సౌందర్యము కలవాడును
పుట్టుకతోనే మంచిరూపముతొను, దాక్షిన్యము తోను జనించిన వాడును 
శ్రీ రామ చంద్రుని స్వరూపమును గూర్చి మారుతి యధాతధముగా చెప్పు చుండెను

 తేజమును - సూర్యుని తో సమానుడును
ఓర్పును - భూమి తో సమానుడును
బుద్ధి యందు  - బృహస్పతి  తో సమానుడును
కీర్తి యందు - ఇంద్రునితో సమానుడును


సమస్త జీవలోక రక్షకుడును
తనవారి అందరికి రక్షకుడును 
 ఉత్తమనడవడికతొ పాలించు వాడును
ధర్మం తొ శత్రు సంహారకుడును 

ఓ భామిని రాముడు ఈ సమస్త ప్రపంచకమును 
నాలుగు వర్ణాల వారినీ రక్షించు చుండెను 
లోకములో అందరకి కట్టు బాట్లు ఏర్పరిచెను 
అందరు కట్టుబాట్లుతో ఉండునట్లుగా చుచు చుండెను


రాముడు మిక్కిలి కాంతి మంతుడును 
మిక్కిలి గౌరవింప దగిన వాడును
బ్రహ్మచర్య వ్రతములో ఉన్నవాడును
సత్పురషులకు  ఉపకారము ఎట్లుచేయవలెనో తెలిసిన వాడును


కర్మల ప్రయోజనము, ఫలితము తెలిసిన వాడును 
ఏ పనికి ఎట్టి ఫలితము వచ్చునో  ఊహించ గలవాడును
రాజనీతి ధర్మమును చక్కగా  అమలుపరుచు వాడును 
బ్రాహ్మణుల విషయమున గౌరమును చూపినవాడును


రాముని భుజములు విశాలమైనవి గను 
భాహువులు దీర్ఘమైనవి గను 
కంఠం శంఖా కారము గను
 ముఖము మంగళ ప్రదమై య్యుండును


సుందరమైన రాముని నేత్రములు ఎర్రగాను 
ప్రక్క య్యముకలతో భాహు బలిగాను
రామ్ అనే పేరు లోకమంతా వ్యాపించు ఉండును
విద్యాశీల సంపన్నుడు, వినయ వంతుడును


రాముడు యజుర్వేదము చక్కగా అద్యయనము చేసిన వాడును
మహాత్మూలచేతను, వేదవేత్తలచేత గౌరవము పొందిన వాడును 
ధనుర్వేదము నందు మిగిలిన మూడు వెదము లందును
ఉపవెదములందు  వేదవేదాన్గములందు పాండిత్యము కలవాడును


రాముని కంఠధ్వని దుందుభి వలే గమ్బీరముగా ఉండును
రంగు నిగనిగలాడుతూ నల్లని రూపములొ అందరిని ఆకర్షించు చుండును 
రాముని అవయవములన్నీ  సమముగా విభక్తములై  ఉండును 
గొప్ప ప్రతాపము  చూపి శత్రువులను పీడించు  వాడును


వక్షస్థలము,  ముజేయి,  పిడికిలి స్థిరముగా ఉండే వాడును
కనుబొమ్మలు, ముష్కములు,  భాహువులు, దీర్ఘముగా ఉండును
కేశములు, మోకాళ్ళు, హేచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉండును 
 నాభి,కడుపు క్రిందభాగము, వక్షస్థలము పొడవుగా ఉండును 


నేత్రములు, గోళ్ళు, అరచేతులు, అరకాల్లు ఎర్రగా ఉండును 
పాదరేఖలు,కేశములు, లింగమని నున్నగా ఉండును 
కంఠధ్వని, నడక, గమ్భీరముగా ఉండు వాడును
 అవావసౌష్టమే అద్భుతం పూర్ణ చంద్రుని మోముగలవాడును 


ఉదరము నందు మూడు ముడతలు గలవాడును 
స్తనములు, స్తనాగ్రములు రేఖలు అను మూడింటి యిందు లోతైన వాడును 
కంఠం,  లింగం, వీపు, పిక్క,  అను నాలుగు హ్రస్వములుగా ఉన్నవాడును
రాముని శిరస్సునందు మూడు  సుడులు కలవాడును


అంగుష్టము మోదట నాలుగు వేదములును సూచించు రేఖలు కల వాడును
అతని నుదుటిపైన, అరచేతులలోన,  అరకాళ్ళలోన,  నాలుగేసి రేఖలు ఉండును
మోకాళ్ళు ,తొడలు,పిక్కలు బాహువులు సమానముగా ఉన్న వాడును శ్రీ రాముడు తొమ్భైఆరు అంగుళముల (8 అడుగులు) ఎత్తు కలవాడును


రెండు కనుబొమ్మలను , రెండు నసాపుటములను
 రెండు నెత్రములను, రెండు కర్ణములను
రెండు పెదవులను, రెండు స్తనానగ్రములను
రెండు చేతులను, రెండు ముంజేతులను


రెండు మోకాళ్లను, రెండు ముష్కములను
 రెండు పిరుదులను, రెండు చేతులను 
రెండు పాదములను, పిరుడులపై కన్దరములను 
జంటలుగా ఉన్న 14 అంగములు సమానముగా ఉన్న వాడును


సింహము, ఏనుగు, పెద్దపులి, వృషభము వలే నడుచు వాడును 
ముక్కు, గడ్డము, పెదవులు, చెవులు చాలాఅందముగా ఉన్న వాడును 
కళ్ళు, పండ్లు, చర్మము, పాదములు, కేశములు నిగానిగాలాడు చుండును 
రెండు దంత పంక్తులలో స్నిగ్దములు, తెల్లని మెరుపు కలిగి ఉండును


ముఖము, కళ్ళు, నోరు,నాలుక, పెదవులు, దవడలు, స్తనములును
గోళ్ళు,  హస్తములు,అ పాదములు, ఈ పది పద్మము వలె ఉండును
శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వక్షము, హృదయమును
కడుపు, చేతులు, కాళ్ళు, వీపు ఈ  పది పెద్దవిగా ఉండును


తేజస్సు, కీర్తి, సంపద అను మూడింటి చేత లోకమంతా వ్యాపించి యుండును
చంకలు, కడుపు, వక్షము, ముక్కు, మూపు, లలాటము ఆరు ఉన్నతములై ఉండును 
వ్రేళ్ళ కణువులు, తలవెంతుకలు, రోమములు, గోళ్ళు, లింగము, చర్మమును
మీసమును, దృష్టి, బుడ్డి అను తొమ్మిదింటి యందు సూక్షమములుగా ఉండును 


ధర్మ అర్ధ అక్కమములను సమముగా అనుభవించు వాడును 
శుద్దమగా మాతా-పితృ వంశములు  కలవాడును
సత్య, న్యాయ, ధర్మములందు ఆసక్తి కలవాడును
సర్వలోక ప్రియముకోరకు ప్రియముగా మాట్లడువాడును 


శ్రీమంతుడు ప్రజలను దగ్గరకు తీయ్యుట యందును
వారిని అనుగ్రహించుట యందు ఆసక్తి కలవాడును
దేశకాలయుక్తా యుక్తములయందు జ్ఞానము కలవాడును
పరాజయము అనేది తెలియని మహానుభావుడును 


రాముని యొక్క సవతి సోదరుడగు సౌమిత్రి అమిత ప్రభగలవాడును
అనురాగాముచేతను రూపముచేతను  గుణములచేతను రాముని వంటి వాడును 
మనుజులలో శ్రేష్టులైన ఆ రామ లక్ష్మణలు నిన్ను చూచుటకు వేదక సాగెను 
ఆసక్తితో భూమిపై అంతటా సంచరించుచు మమ్ములను కలుసుకొనెను


భూమియంతయు నిన్నే వేదుకు చుండెను
రాజ్య ఛ్యుతుడైన మృగపతి సుగ్రీవుని కలిసెను
సుగ్రీవుడు తనఅన్నకు భయపడి అనేక వృక్షములతోను 
ఉన్న ఋష్యమూకపర్వతముపై వసించు చుండెను


సత్యప్రతిజ్నుడును  అన్నవలన భయముచే పీడితుడును
అన్నచే సింహాసనము నుండి దింప బడిన వాడును
అగు వానర రాజైన సుగ్రీవునకు సచివుడను నేను 
నేను సుగ్రీవుని సేవిస్తూ జీవించు చున్నాను 




అటు పిమ్మట నార చీరలు ధరించిన వారును 
శ్రేష్ట మైన ధనుస్సు ధరించిన వారును
అగు రామలక్ష్మణులు ఋష్యమూక పర్వత ప్రాంతమునను 
ఆయా ప్రదేశములలో నిన్నే వెదకు చుండెను


వానరార్షభుడగు సుగ్రీవుడు ఆ నారా శ్రేష్టులగు రామ లక్ష్మణులను
చూసి భయమోహితుడై ఆ పర్వతముయుక్క ఉచ్చ శిఖరమును చేరెను
ఆక్కడనే ఉండివారి సమీపమునకు పోయి వివరములు తెలుసుకు రమ్మని నన్ను పంపెను 
నేను పురుష శ్రేష్టులైన రామలక్ష్మణుల దగ్గరకుకు నమస్కరించుతూ వెళ్లాను 


సుగ్రీవుడాజ్న ప్రకారము నేను సౌందర్యముతో కూడిన సర్వ సమర్ధులను 
కలసి సాజలి భద్దుడినై ఎగితిని వారు నావలన యదార్ధము తెలుసుకొనెను
ప్రీతియుక్తులైన రామ లక్ష్మణులను నావీపుపై నెక్కించుకొని సుగ్రీవునివద్దకు చేర్చాను 
మహాత్ముడగు సుగ్రీవునకు నాచే ఉన్నది ఉన్నట్లుగా వారిని గూర్చి నివేదించబడినాను 


రామ సుగ్రీవులు పరస్పరము సంభాషించు కొనెను 
వారిరువురకు మిక్కిలి స్నేహము ఉత్పన్నమాయెను 
పూర్వము జరిగిన కధలన్నీ ఒకరికి ఒకరు ముచ్చటించు కొనెను 
వారిద్దరికీ పరస్పరము పూర్తి విశ్వాసము ఏర్పడెను


విపులమగు తేజస్సు గల సోదరడగు వాలిచే స్త్రీ మూలకముగను 
గృహమునుండి వెడల గొట్టబడిన సుగ్రీవున్ని రాముడు ఓదార్చెను
తరువాత నీవు కనబడకపోవుటచే రామునకు కలిగిన దు:ఖమును 
గూర్చి లక్ష్మణుడు వానర ప్రభువైన సుగ్రీవునకు నిన్ను అపహరించుట గురించి విన్నవించెను 


సుగ్రీవుడు  లక్ష్మణుడు చెప్పిన సీతాపహరనము గురించి వినెను
  సుగ్రీవుడురాహువు మింగిన సూర్యుడివలే మిక్కిలి కాంతి విహీను డయ్యెను 
రావణుడు అపహరించు తీసుకొని వెళ్ళునప్పుడు నీవు అలంకారముగా ఉన్న అభరణములను 
భూమిపై పడినప్పుడు వానిని పోగు చేసి నేను సుగ్ర్రివుని వద్ద ఉంచినాను


శ్రీ రామునకు నీవు ఎక్కడ వున్నావో మార్గము తెలియయ దాయెను
నీవుభూమి మీద పడవేసిన ఆభరణములను పోగుచేసిన అన్నియును
శ్రీ రామునకు చూపినాను వెంటనే చూసిరాముడు  మూర్చ పోయెను
ఆభరణములను వడిలో పెటుకొని పలు విధములగా విలపించెను 


ఆ అభరణములు దాశరధియొక్క శోకమును అగ్నిని ప్రజ్వలిత మొనర్చెను 
దేవతుల్య ప్రకాశకుడగు రాముడు మిక్కిలి దుఖసగారమున మునిగెను
 దు:ఖార్తుడైన రాముడు చిరకాలము భూమిపై చేతన్యరహితుడుగా పడిపోయెను
నేను పెక్కు అశ్వాసనవచనములను పలికి అతి కష్టము మీద లేచునట్లుగా చేసినాను 


పూజ్యరాల నీవు కనబడక పోవుటచే ప్రతి నిముషమునను
ప్రజ్వలించు చున్న అగ్నిచేత అగ్నిపర్వతమువలె తపించు చుండెను
రాఘవుడు నీ మీలమున కల్గిన సోకచింతతో నిద్రలేకుండా తపించు చుండెను 
రాఘవుడు మహొత్తరభూకంపముచె కంపించు పర్వతమువలె కంపించు చుండెను


ఓ రాజకుమారీ నీవు కనబడకపోవుటచే రమ్యములైన అరణ్యములను
నదులను, కొండవాగులను దర్శించిన  సుఖములేకుండా ఉండెను 
రావణున్ని బందుమిత్రసమేతముగా సంహరించి నిన్ను  పొందగలుగును 
ఆనాడు రామ సుగ్రీవులిద్దరూ కలసి వాలిని వధించుటకును నిన్ను అన్వేషించుటకును వప్పందం చేసుకొనెను


దశరధరాముడు  వేగముగా వాలిని సంహరించెను
సమస్త కపి భల్లూకములకు సుగ్రీవున్ని  ప్రభువును చేసెను
ఓ దేవి రామ సుగ్రీవులకు ఈవిధముగా మైత్రి ఏర్పడెను
నేను వారిద్దరూ పంపగా దూతగా వచ్చిన హనుమంతుడను




సుగ్రీవుడు రాజ్యాధిపతిగా మారి మహాబల సంపన్నులగు కపులను 
భాల్లుకాలను పిలిపించి పది దిక్కులను నిన్ను వెదుకుటకు పంపెను
మహాకాయములు కలవారు అద్భుత శక్తి కలవారు వెదుకుట  ప్రారంభించెను 
మేము సుగ్రీవునాజ్ఞకు భద్ధులమై పర్వతాలను  అరణ్యములను వేదకసాగెను 


మహాబల సంపన్నుడును, కపివరుడును, శోభాశాలియును
వాలి పుత్రుడగు అంగదుడు మూదు వంతుల సేనను 
తీసుకొని నిన్ను వెదుకటకై బయలుదేరి వనములను
పర్వతములను వెతకగా నీవు కానరాక కార్యవైరశ్వమ్ చెందెను


కపిరాజగు సుగ్రీవుని భయము వలనను  
పెట్టిన గడువు దాటి పోవుట వలనను
త్రోవతప్పి వింధ్య పర్వతము వద్ద తిరుగుట వలనను
మేమందరమూ ప్రాణత్యాగము కొరకు సిద్దపడితి యున్నామును  


మేము పర్వతశిఖరముపై ప్రాయొపవేశములకై పూను కొంటిమియును
ప్రాయోపసిష్టులైన వారిని చూచి శోకసాగరమునమున ఉన్నఅంగదుడు విలపించెను  
ఓ వైదేహి నీవు కనబడకపోవుట, వాలివధయును  మాయోక్క ప్రాయోప వేశమును 
జటాయువు మరణము గూర్చి తలుస్తూ అంగదుడు  విలిపించు చుండెను  


మేము వచ్చిన పని సఫలము అగునట్లుగా వచ్చినవాడును  
పరాక్రమవంతుడైన ఒక గొప్ప పక్షి రాజు అక్కడకు వచ్చెను
జటాయువు సోదరుడైన సంపాతి అంగదుడు విలపించుటకు 
కారణమడిగెను
అంగదుడు చెప్పిన మాటలకు గ్రద్దరాజు సోదరుని వధ గూర్చివిన్న
 కోపముతో ఇట్లు పలికెను


నా తమ్ముడు అగు జటాయువు ఎవ్వనిచే చంప బడెను
ఓ వానరోత్తములారా ఎక్కడ నెలపైకూల్చ  బడినాడును
జటాయువు అరణ్య ప్రాంతములో కూలగ శ్రీ రాముడు స్వయముగా ధహన సంస్కారములు చేసెను
మీ వలన వార్తను విన్నాను, మీకొక విషయమును చెప్పదలచుకున్నాను


ఆ సంపాతి నీవు రావణుని గృహము నందు ఉన్నట్లుగా తెలిపెను 
సంతోషమైన వార్త విన్న అందరమూ ఉస్ఛాహము చే నిన్ను 
చూడవలెనను
కోరికచే వింధ్య పర్వతమునుండి బయలు దేరి సముద్రప ఉత్తర తీరమును  
చేరి మహాసముద్రమును చూసి భయముపడి మరల చింతా గ్రస్తులై యుండెను 


 వానర భయమును  తొలగించి సముద్ర నూరు యొజనములను దాటినాను  
నేను రాక్షసులాతో నిండిన లంకలోకి రాత్రి పూట ప్రవేశించినాను
నిద్రిస్తున్న రావణున్ని, దు:ఖముతో ఉన్న నిన్ను చూసినాను 
ఓ సీతాదేవి ఇప్పటికి జరిగిన దంతయు యదాతధముగా చెప్పినాను


ఓ దేవి నేను దశరధనందనుడగు శ్రీ రామునికి దూతను
నాతోమాట్లాడుము నేను శ్రీ రామునికార్యసిద్దికై య్యత్నించు చున్నాను 
నిన్ను చూచుటకై ఇక్కడకు వచ్చి యున్నాను, నేను సుగ్రీవుని సచివుడను  
వాయుపుత్రుడును,భయము వదులుము నేను చెప్పినవి య్యదార్ధమని పల్కేను 


సర్వశాస్త్రములలొ శ్రేష్టుడగు శ్రీరాముడు కుశలముగా నుండెను
లక్షణుడు వీర్యవంతుడగు తన యన్నకు హితకరిగా నుండెను
నేను సుగ్రీవుని ఆజ్ఞ చే ఒంటరిగా సముద్రమును దాటి వచ్చినాను 
స్వెఛసారముగా రూపమును మర్చి ఈ లంకలో నిన్ను కలిసినాను


ఓ దేవి దైవ యోగమువలన ఈ సముద్రలంఘనము వ్యర్ధము కాలేదును  
నీవు కనబడుటవల్ల శ్రీ రాముని యందు వానరుల యందు ఉన్న దు:ఖమును పోగొట్టగలను 
భాగ్యవశముచే  నీవు కనబడి నావని రామునికి వానరులకు చెప్పెదను   ఇది కుడా నా అద్రుష్టమే, నిన్ను చూడగలిగితి నను కీర్తిని పొందగలను


మహాపరాక్రమశాలి అయిన రాముడు రాక్షసాధి పతియైన దశ గ్రీవమహారాజును
భండుమిత్రసహేతుముగా సంహరించి సీఘ్రముగ నిన్ను పొందగలుగును  
ఓ సీతాదేవి పర్వతములన్నింటిలో మూల్యమైన పర్వతము ఉండెను 
ఆకడి నుండి కేసరి అను వానరుడు గోకర్ణ పర్వతమును వెళ్ళెను 
  

నా తండ్రియైన కేసరి, దేవతలు,  బుషులు ప్రార్ధించగా సముద్రతీరము నందును 
ఉన్న పవిత్రప్రదేశములొ నా తండ్రి శంబుసాదనుడను రాక్షసుని సంహరించెను 
ఓ సీతాదేవి నేను ఆ కేసరి భార్య యందు వాయుదేవుని వలన పుట్టినాను
నేను చేసినపనిని పట్టి నన్ను లోకములో  హనుమంతుడను పేర ప్రసిధ్యుడగును 


ఓ సీతా దేవి నమ్మకము కల్గించుటకై నీ భర్తైన రాముని గుణములు వర్ణించి చెప్పినాను
నీవు కొద్దికాలములో రాముడు నిన్ను ఇక్కడినుండి తీసుకొని
 వెల్ల గలుగును 
సీతకు  సరియైన హేతువులను చూపుట ద్వారా హనుమంతునిపై విశ్వాసము కలిగెను
ఆనవాళ్ళను బ్నట్టి అతడు రావణుడు కాదు రామదూత అని నిర్ధారణకు వచ్చెను 


జానకి కి సాటిలేని సంతోషము కలిగెను 
ఆనందముతో నెత్రములనుండి ఆనందభాస్పాలు రాల్చెను
ఎర్రగాను తెల్లగాను దీర్ఘముగాను ఉన్న నేత్రములు కలదియును 
సీత ముఖము రాహువు విడిచిన చంద్రుడివలె ప్రకాశించెను 


ఇప్పుడామె అతడు వానరుడే యని అన్యధా కాదని తలచెను
ప్రియ దర్శినియగు ఆమెతో హనుమంతుడు ఇట్లు పలికెను
ఓ దేవి నీకు అంతా చెప్పినాను కదా, నీవు కొంచము ఒపిక పట్టవలెను 
మీకు నేను ఏమిచేయవలేనో, నీకెది ఇష్టమో చెప్పుము, చేసి నేను తిరిగి వెల్లెదను 

ఓ సీతాదెవి మహర్షులు కపివరుడైన కేసరిని ప్రేరేపించెను
యుద్దమునందు శంబుసాదుడను రాక్షసుడిని చంపెను
నేను వాయు దేవుని వలన జనించిన వానరుడను 
ప్రభావము చేతను నేను ఆవాయుదేవుని అంతవాడను 

శ్రీ సుందర కాండ నందు 35వ సర్గ సమాప్తము

Saturday, 20 June 2015

ప్రాంజలి - సుందర కాండ తెలుగు వచస్సు (34వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:




 34వ సర్గ (వాల్మికి రామాయణములోని 40 శ్లోకాల  తెలుగు వచస్సు)
("హనుమంతుని విషయమును సీతకు సందేహము కలుగుట హనుమంతుడు ఆ సందేహమును తొలగించుట, సీత కోరగా హనుమంతుడు శ్రీ రాముని గుణములు వర్ణించి చెప్పుట ")    


కపివరుడగు  హనుమంతుడు దు:ఖాబి భూతయగు సీతయొక్క వచనములను
మిక్కిలి దు:ఖముతో ఉన్న  ఆ సీతను నోదార్చుటకు ఈ విధముగా పలికెను
ఓ దేవి నేను శ్రీ రాముని దూతను రాముని యొక్క సందేశమువలన నీదగ్గరకు వచ్చినాను 
రాముడు కుశలముగ ఉన్నాడు, నీక్షేమ సమాచారము అడగమని అనెను 


ఎవనికి బ్రహ్మాస్త్రము తెలియునో 
ఎవ్వడు వేద్దవేత్తలలో శ్రేష్టుడో
ఎవ్వనికి వెదములన్ని తెలియునో 
ఆ రాముడు నిన్ను క్షేమమడి నాడు అనెను


నీ భర్తకు చాలా ఇష్టుడైన తమ్ముడును
అన్నగారి వెంట ఉన్న మహా తేజ సంపన్నుడును 
అగు లక్ష్మణుడు శోకముతో యుండియును 
నీకు శిరోవందనమును చేసినాడు అని చెప్పెను


ఆ  సీతాదేవికి రామ లక్ష్మణుల క్షేమమును విని సర్వాంగములు పులకించెను
హనుమంతునితో సీత ఇట్లు పలికెను "బ్రతుకియున్న నూరు సంవత్చరము లైనను "
ఆనందము సంప్రాప్తమగును లోకములో ఉన్న సామెతయును  అనెను
మంగళకరమైనది సత్యమైనది అని నేను తలచు చున్నాను 


తన దగ్గరగా వచ్చిన ఆ హనుమంతునిపై  అద్భుతమైన స్నేహమును చూపెను 
వారిద్దరూ విశ్వాసముకలవారై  పరస్పరము సంభాషణనములు ప్రారంభించెను
 సీత మాటలు విని హనుమంతుడు శోకతప్తురాలగు సీత సమీపమునకు రాసగెను
హనుమంతుడు దగ్గరగా వస్తున్నా కొద్ది రావణుడేమో యను శంక  హెచ్చు సాగెను


అయ్యో చీ చీ నేను విషయమంతా వీనికి చెప్పినాను 
నేను రాముని ప్రేమతో ఇంత  తప్పు చేసినాను
యితడు మారు వేషము ధరించిన రావణుడే యగును 
అశోకవృక్షశాకను వదిలి శోకముచేత నేలపై కూలబడెను


అటుపిమ్మట దీర్ఘభాహువగు హనుమంతుడు జానకికి నమస్కరించెను 
కాని సీత భయము ఉండుటవల్ల తలఎత్తి హనుమంతున్నీ చూడ కుండా ఉండెను
చంద్రునివంటి మోముగల సీత హనుమంతున్నీ ధైర్యము చేసుకొని చూసెను 
దీర్ఘవిశ్వాసమును విడిచి మధుర స్వరమున నెమ్మదిగా ఇట్లు పలికెను


నీవు సాక్షాత్తు మాయా రూపములొ వచ్చిన రావణుడే అయినను
నాకు ఎక్కువ సంతాపము కల్గించుట నీవంటి వానికి మంచిది కాదును 
నాపతిలేని సమయాన నిజరూపమునను వదలి పరివ్రాజరూపమునను
నన్ను భాదాపూర్వకముగా తేబడిన నిశాచరుడవు నేవే యగును


ఒరాక్షసుడా ఉపవాసముతో కృశించి యున్నాను నేను
దీనురాలుగా ఉన్న నన్ను  మిక్కిలి భాదించుట మంచిది కాదును
కాని నేను అనుమానిన్చినట్లు ఇది యట్లుకాక పోవచ్చును 
ఎందుచేతననగా నిన్ను చూడగానే  నామనస్సు ఆనందము కల్గెను


నీవు రామునికి దూతగా వచ్చినచో నీకు మేలగును 
హరిశ్రేష్ట నిన్ను రాముని గూర్చి అడుగుచున్నాను,రామకధ అనిన మిక్కిలి ఇష్టమును
ఓ వానరా నాప్రియుడగు రాముని యొక్క గుణగాణములు తెలుపవలెను 
నడ్డి వేగము నదీ తీరమును హరించినట్లు, హరించు చున్నావు నా చిత్తమును 


చాలా కాలము క్రితము అపహరించ బడిన నేను
నా రాముడు పంపిన వానరుడను  చూచుచున్నాను
రాముడు నాకు స్వప్నంలో కనబడినను జీవించగలను
నా విషయములో నిద్రేరావటములేదు, మరి స్వప్నము ఎలా వచ్చును


నాకు అభ్యుదయము కలిగినది, మోహము నన్ను ఆవరించ కుండ ఉండెను 
నా చిత్త్తము స్తిరముగా ఉండెను, ఇంకను వాత ప్రకోపములు కలుగ లేదును 
ఉన్మాదము వలన వికారము చెందలేదును, నేను ఎండ మావులుగామరలేదును 
ఎల యనగా నన్ను నేను పూర్తిగా తెలుసు కొన గలుగుతున్నాను 


ఎదుట ఉన్నవానిని కుడా వానర వీరుడని తెలుసుకొను చున్నాను 
సీత బలాబలములను నిర్ధారణకు వచ్చి రాక్షసులు కామ రూపులగుట చేతను
నాదగ్గరకు వచ్చిన వాడు నిజముగా రావణుడే అయి ఉండ వచ్చును 
సీత అప్పుడు మనసులో అనుకోని ఆ వానరునికి ప్రతివచనములు పలుక కుండెను 


హనుమంతుడు సీత ఆలోచనలను కనిపెట్టెను
అప్పుడామెను సంతోష పెట్టుటకు భాష్యము తెలిపెను 
రాముని తేజస్సు సూర్యుని తేజస్సు వంటి దనెను 
చంద్రుడి వలె లోకములకు మనోహరుడును


రాముడు ఎప్పుడు సత్యమునే పలుకును
బృహస్పతివలె మధురముగా మాట్లాడును 
రూపవన్తుడు, మంచిభాగ్యము  కలవాడును
సుందరుడు, మన్మదుడే ముర్తి మంత  మైనట్లుండెను


కోపింపదగినవారిని ప్రహరించుటలో శ్రేష్టుడును 
ఈ లోకములో శ్రేష్టుడైన మహా రధికుడును
ఈలోకమంతయు మహాత్ముని భాహువుల నీడను
కల్పించి ప్రజలందరికి శోభకల్గించు వాడును 


ఆ రావణుడు  మాయలేడి రూపమున ఆశ్రమము నుండి రాఘవున్ని దూరముగా తీసుకెల్లెను 
ఆ రావణుడు లక్ష్మణుడు కుడా లేని సమయాన పర్ణశాలనుండి నన్ను అపహరించెను 
అ పాపమునకు కలుగబోవు ఫలమును ముందు జరుబోవు యుద్ధములో  పొందును   
వీర్య వంతుడైన రాముడు కొలది కాలములోనే ఆ రావణున్ని యుద్దమునందు సంహరించ కల్గును


రాముడు క్రోధము చే విడిచినవియును 
ప్రజ్వలించు ఆజ్ఞలను బోలిన భాణములను
లంకాధిపతి యైన రావణునిపై ప్రయోగించును
రామ బాణాలతో రాక్షసులను రావణున్ని సంహరించును 


నేను  రాముని దూతగా నీ యొద్దకు వచ్చినాను 
ని వియోగాముచే దు:ఖార్తుడై  విలపించు చుండెను 
ఆ రాముడు నీ క్షేమము అడిగినాడు అని పెల్కెను
సుగ్రీవుడు నీకు నమస్కారము  చేసి నీ క్షేమమడిగెను


సుగ్రీవుడు రామునికి ముఖ్య స్నేహుతుడుగా మారెను
వానర ముఖ్యుడు రాజగు సుగ్రీవుడు నిన్ను క్షేమమునడిగెను  
లక్ష్మణ సాహితుడగు రాముడు నిన్ను స్మరించు చుండెను 
ఓ వైదేహి నీవు రాక్షస స్త్రీల యొక్క స్వాధీనములొ ఉండునట్లు తెలియ  కుండును 

రామ లక్షమన సుగ్రీవులు   నిత్యము నిన్నే స్మరించు చుండెను 
దేవి నీ భర్త వచ్చి నిన్ను రక్షించుతాడని నమ్మకముతో యున్నావును
నా పేరు హనుమంతుడు నేను సుగ్రీవుని సచివుడైన  వానరుడను
 మహాసముద్రము దాటి లంకా నగరములో పవేసించినాను 

నీవు కొద్ది దినములలోనే గుణాబిరాముడును 
అన్నకు తోడుగా మహాబలశాలియైన లక్ష్మణుడను 
వానరు లందరిలో కలసి వానర రాజగు సుగ్రీవుడును
కలసివచ్చుట నీవు తప్పక చూడ గలుగును  

దురాత్ముడగు రావణుని యొక్క తలపై  పాదన్యాసము చేసినాను
నా పరాక్రముమునే  చేసుకొని నిన్ను చూచుటకు వచ్చినాను
నీ వనుకున్నట్లుగా నేను నిజముగా రాముని పంపిన వానరుడను 
ఓ దేవి నీవు సందేహము విడువుము నాపలుకులు విశ్వసింపమనెను 
  
శ్రీ సుందర కాండము నందు 34వ సర్గ సమాప్తము


Wednesday, 17 June 2015

ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (33వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:



 33వ సర్గ (వాల్మికి రామాయణములోని 33 శ్లోకాల  తెలుగు వచస్సు)
("సీత హనుమంతునకు తన విషయమును చెప్పుచు తన అరణ్యే గమనమును, రావణుడు తనను అపహరించుటను వర్ణించుట   ")    


పగడము వంటి ఎర్రని ముఖము గలవాడును 
మహా తేజశాలి వాయు పుత్రుడైన హనుమంతుడును 
వినాయమగు వేషము కలవాడై దీనముగా ఉన్న సీతను
సమీపించి తలపై దోసిలుపెట్టి నమస్కరించుతూ ఇట్లుపలికెను



ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (32వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:




 32వ సర్గ (వాల్మికి రామాయణములోని 14 శ్లోకాల  తెలుగు వచస్సు)
(" హనుమంతుని చూచిన సీతకు కలిగిన ఆలోచనలు  ")    


కొమ్మల మధ్య అణిగియున్న వాడును
తెల్లని వస్త్రములు ధరించిన వాడును 
మెరుపుపండును బోలి పింగళవర్ణము గలవాడును
అగు హనుమంతుని సీత చూచి ఉలిక్కి పడెను


వికసించిన అశోకములను బోలిన శరీరం కలిగిన వాడును
కరిగిన బంగారము వంటి చూపులు గలవాడును
వినీతుడై  ప్రియవాక్యములు పలుకుచున్న వానరుడను
సీతాదేవి చూచి మిక్కిలి ఆశ్చర్యము పొంది తనలో తానిట్లనుకొనెను 


అయ్యో వానరజాటికి చెందిన ఈ మృగము చాల భయంకరముగాను 
పట్టుకొనుటకు వీలు లేనిదిగను, చూడ శక్యము కానిదిగను 
భయ మొహితమైన సీతాదేవి వానరున్ని చూసి మూర్చ బోయెను
సీతాదేవి దు:ఖార్తయై రామ రామ అనుచు మిక్కిలి కరుణముగా విలపించెను


సీతాదేవి మంద స్వరమున హటాత్తుగా రోదనము చేసెను
ఆమె వినయముతో సమీపమున వచ్చిన కపివరుని చూసి స్వప్నమని తలపోసేను
ఆమెవిశాలమైన వంకర పోయిన ముఖము గలవాడును, సుగ్రీవుని ఆజ్ఞ పాలకుడును
మిక్కిలి పూజింప దగిన వాడును బుద్ధిమంతులలో శ్రేష్టుడును, వాతాత్ముడను చూసి మూర్చ పోయెను   


సీత హనుమంతుని చూసి మిక్కిలి వ్యధ చెంది  మ్రుతురాలువలె కోయ్యబారెను 
చాలాసేపటికి సీతాదేవి తెప్పరిల్లి నేనొక చాల చెడ్డ స్వప్నమును  చూచు చున్నాను 
వానర రూపము స్వప్నములో కనబడుట మంచిది కాదని శాస్త్రములు చెప్పబడు చుండెను
రామునకు, లక్ష్మణునకు, జనకమహారాజునకు క్షేమమగుననే నేను ప్రార్ధించు చున్నాను 


కాని నాకు ఇది స్వప్నము కాదు దు:ఖశోకపిడిత నగు నాకు నిద్ర వచ్చుట లేదును 
చంద్ర్రనిభానుడగు రామునితో విరహితనైన నేను సుఖము ఎక్కడ పొందుచున్నాను
నేను సదా రామ రామ అని బుద్ధితో చింతించుచూ వాక్కుతో అతనినే పలుకు చున్నాను 
అట్టి అర్ధమునె ఇచ్చునదియును, దానికి అను కూలమును అగు కధనే  వినుచున్నాను 


శ్రీ రామ గతమగు సన్పూ ర్ణ భావముగల నేను రామ సంభంధమైన కోరికతోను
ఇప్పుడు నిరంతరమూ శ్రీ రాముని గూర్చి చింతించుచు అతని కధనే విను చున్నాను 
ఎప్పటికైనాను నా మనోరధము సఫలమగునని ఆశతో జీవించు చున్నాను 
ఇప్పుడు మాత్రము స్పష్టమైన ఆకారముతో మాట్లాడు వానికి సమాధానము చెప్పవలెను


ఇది నా మనోరధమే యని కాని బుద్ధితో తర్క వితర్కములలో మునిగి యున్నాను   
మనొరధమునకు రూపము లేదు, కాని యితడు స్పష్టమైన రూపముతొ మాట్లాడు చుండెను 
వాచస్పతికును, వజ్రధారియగు ఇంద్రునకు, స్వయం భువునకును ప్రార్ధించు చున్నాను
నా ఎదుట ఈ వనేచరుని చెప్పునది నిజమే యగును, మరొక విధముగ జరుగ కుండును 

శ్రీ సుందర కాండము నందు 32వ సర్గ సమాప్తము

Monday, 15 June 2015

31. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (31వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:



 31వ సర్గ (వాల్మికి రామాయణములోని 19 శ్లోకాల  తెలుగు వచస్సు)
(" హనుమంతుడు సీతకు కనబడ కుండా ఆమెకు రామ కధ 
 విని పించుట  ")    

సీత విన బడునట్లుగా శ్రీ రామకధను  మధుర వాక్యములగా హనుమంతుడు పలుకు చుండెను 
ఇక్ష్వాకు వంశములలొ గొప్ప యశస్సుగల పుణ్య శీలుడైన దశరధ మహా రాజు ఉండెను
అతడు రధ,గజాశ్వ, సైన్యములతో మహాబలశాలియై కీర్తి గలవాడై యుండెను
ఆ దశరధుడు గుణముల చేత  రాజర్షులందరిలో శ్రేష్టుడు, ఐశ్వర్యం కలవాడును


చక్రవర్తి కులమునందు పుట్టినవాడు, బలములో దేవేంద్రునితో సమానుడును
ఆ దశరధుడు ఆహింసా పరుడు, నీచ స్వభావము లేని వాడును 
ఇక్ష్వాకు వంశములొ చాల ప్రధానమైనవాడు, దయా శీలుడును
ధర్మ మార్గమున ఐశ్వర్యమును పెంపొందించినవాడును 
సత్యపరాక్రమము కలవాడు, ఉత్తమ రాజ లక్షణములు కలవాడును
నాలుగు సముద్రముల వరకు ఉన్న భూమి యందు మిక్కిలి 
ఖ్యాతిగల వాడును 
తను సుఖమనుభ వించుచు ఇతరులకు సుఖమును కలుగ చేయు వాడును
ఆ దశరధునకు ప్రియమైన వాడు రాముడను పేరుగల జేష్ట పుత్రుడు  
శ్రీరాముడు చంద్రుడి వంటి ముఖము గలవాడును 
మానవులలో ఉన్న విశేషమును గుర్తించు సమర్దుడును 
సత్య సంకల్పము గలవాడును ధనుద్దారులలో శ్రేష్టుడును
తనవాళ్ళను సకలజీవలోకమును సకల ధర్మములను రక్షించువాడు


శ్రీ రాముడు తననడవడిలో ఎట్టిలోపములేకుండా రక్షించు కొను చుండును 
తనతండ్రి వృద్ధుడైన దశరధ మహారాజు ఆజ్ఞ చేతను 
ఆరాముడు భార్యతోను, సోదరునితోను అరణ్యమునను ప్రవాసము వెళ్ళెను 
శ్రీరాముడు అరణ్యములో స్వెచ్ఛా రూపధారులు అయిన రాక్షసులను సంహరించెను 


పిమ్మట రావణుడు జనస్థానములోని రాక్షసుల వధను
ఖరధూషనుల వధను విని కోపముతో తీవ్రరూపము దాల్చెను  
మాయా మృగ  రూపముచేత అరణ్యములో శ్రీరాముని వంచించెను
రావణుడు మాయారూపమున ఇంట ఎవ్వరూలేని సమయాన  జానకిని అపహరించెను


రాముడు ఎట్టి దోషము లేని ఆసీత కొరకు వెదక సాగెను
అప్పుడు అరణ్యములొ ఉన్న సుగ్రివుడనే వానరునితో మైత్రి 
 చేసుకొనెను
శ్రీ రాముడు వాలిని చంపి ఆ వానర రాజ్యమును సుగ్రీవునకు ఇచ్చెను 
సుగ్రీవుదు ఆజ్ఞాపించి పంపగా వేల కోలది వానరులు సీతాదేవి కొరకు వెతుకు చుండెను 


మేము సంపాతి వచనములచే సీత లంకలో ఉన్నదని తెలుసు కొనుట  వలనను
నేను వానరుల ప్రోస్చాహముతొ శతయోజనముల సాగరమును దాటి లంకలోకి వచ్చాను
శ్రీరాముడు నాకు చెప్పిన రూపురేఖలు, లక్షణములుగల వనితను చూస్తున్నను 
మృదు మధురముగా క్లుప్తముగా శ్రీ రామకధను హనుమంతుడు విన్పించి విరమించెను


జానకీదేవి కుడా ఆ సంభాషణములను విని మిక్కిలి ఆశ్చర్య పడెను
అటుపిమ్మట ఉంగరములు తిరిగిన కేశములు గల తన ముఖమును 
పైకెత్తి బీరుస్వభవమున సీత అశోక వృక్షము వైపు చూసెను 
కపివరుని వాక్యములు విని అన్ని దిక్కులను చూసి రామునిని స్మరించి హర్షము పొందెను 


సీతాదేవి అడ్డముగాను పైకి క్రిందకు గాను 
ఎగాదిగా చూసె అచింత్య బుద్ధియును 
సుగ్రీవుని సచివు డైన వాతాత్మజుడను
అగు హనుమంతున్నీ ఉదయించు సూర్యునివలె చూచెను

శ్రీ సుందర కాండ నందు 31వ సర్గ సమాప్తము 

Saturday, 13 June 2015

30. ప్రాంజలి - సుందరకాండ తెలుగు వచస్సు (30వ సర్గ)

ఓం శ్రీ  రాం              ఓం శ్రీ  రాం                 ఓం శ్రీరాం
                                             శ్రీ మాత్రే నమ:
                            శ్రీ  రామ చంద్రపరబ్రహ్మనే నమ:



 30వ సర్గ (వాల్మికి రామాయణములోని 44 శ్లోకాల  తెలుగు వచస్సు)
(" సీతతో ఎట్లా సంభాషనములు చేయవలెనో అని హనుమంతుడు ఆలోచించుట ")    


పరాక్రమ వంతుడైన హనుమంతుడు కుడా సీత యోక్క విలాపమును
రాక్షస స్త్రీల  బెదిరింపును, త్రిజట యొక్క స్వప్న వృత్తాంతమును
సీతాదేవి, రావణుడు, రాక్షసస్త్రిలు చెప్పన మాటలు హనుమంతుడు వినెను
సీతాదేవిని నందనవనంలోని దేవతను బోలినట్లుగా మారుతి చూసెను 


గుప్త రూపములొ సంచరించు వాడును 
శత్రువుయోక్క శక్తిని గ్రహించినవాడును   
శ్రీ రామచంద్ర ప్రభుచే నియుక్తుడును
గూదచారివలె ఉన్నది విషయములన్ని తెలుసుకొను చుండెను


హనుమంతుడు సీతాదేవి శోకమును తోల గించాలని అనేక విదాలుగా ఆలోచించెను
వేలకొలది, లక్షల కొలది వానరులు సీతాదేవి కొరకు అన్ని దిక్కులను
వెదుకుతున్నారో ఆమెను నేను రాక్షసుని బందిలొ ఉన్నట్లు చూడ గలిగాను
రాక్షసాధి పతి ప్రభావమును, లంకా రాక్షసు లందరిని చూడ బడినాను
  

అప్రమేయ ప్రభావము కలవాడును, సకల ప్రాణులందు దయగలవాడును
రామునిభార్య పతిదర్శనకాంక్షతొ తల్లడిల్లు తున్నది, ఓదార్చుట యుక్తమును 
కష్టములు నెరగనిదియు చంద్రుని మోము కలదియును దు:ఖమునకు అంతమును 
చూడ జాల కున్నది ఈమెను నేను తప్పక ఓదార్చివలె అనిమారుతి అనుకొనెను  


శోకోప హత చేతనయును, వివేకవతియును పతివ్రత ఐన శ్రీ రాముని భార్యను
సీతను ఒదార్చక పోవుదు నేని నాయొక్క గమనముక దోష యుక్తము కల్గును
నేను వెళ్ళినచో కీర్తిమన్తురాలగు, రాజపుత్రి యగు జానకి, అశోక వనము నందును  
తనను రక్షించు వారు కాన రాక వేరే దారి లేక ప్రాణ త్యాగము చేయ వచ్చును 


మహాబాహువులు గల శ్రీ రామచంద్రుడను 
పూర్ణ చంద్రుని మోఖముగల సీతాదేవి భర్తను 
సీతాదర్శించుటకు ఉవ్విలూరుతున్న దశరధ పుత్రుడను 
నగు కౌసల్యా పుత్ర్రుడ్ని నేను ఓదార్చుట న్యాయ మగును


రాక్షస స్త్రీల ఎదుట మాటలాడుట యుక్తము కాదును
ఈ పని నేనెట్లా చేయగలనో? నేను క్లిష్ట పరిస్తితిలో చిక్కి ఉన్నాను
నేను ఈరాత్రి శేషమునందే ఈమెను నెను ఓదార్చ పోయినచో ఈమె ఏమైనను 
తన జీవితము త్వజించును ఇందు సందేహము లేదు దాన్ని గూర్చే  ఆలో చిస్తున్నాను


శ్రీ రాముడు సీత నన్ను గూర్చి ఏమి పల్కినది అని అడిగినప్పుడు  ఏమి 
చెప్పవలెను?
సుందరమగు నడుముగల సీతాదేవితో  మాటలాడక ఏమి ప్రత్యుత్తరము చెప్పగలను ?   
ఇక్కడనుండి సీతాసందేశము లేకుండగా త్వరపడి వెళ్ళిన ఆకాకుస్థుడు క్రోధించును 
శ్రీరామునకు సమాధానము చెప్పలేక పొతే తీవ్రమైన చూపులతో నన్ను దహించి వేయును 


ఒకవేళ నేను రాముని కార్య సిద్ధి కొరకు ప్రభువగు సుగ్రీవుని ప్రోస్చ హించినను 
మహా సైన్యముతో అతడిక్కడకు వచ్చుట కూడా వ్యర్ధమే యగును  
 రాక్షస స్త్రీల మద్య నుండియే నేను కొంత అవకాసమును సంపా దించెదను
రాక్షస స్త్రీల మద్య మెల్లగా మిక్కిలి సంతాపముతో ఉన్న సీతను ఓదార్చెదను 


నేను చాల సూక్ష్మరూపములో ఉన్నాను విశేషించి వానరుడను అయినాను
స్పష్టమైన అర్ధమును భోధించు మనుష్యవాక్కులతో మాట్లాడుట ప్రయత్నిమ్చెదను 

ఒక వేళ ద్విజునివలె సంస్క్రుతవాణిలో మాట్లాడిన సీత రావణుడని అనుకొనును 
అశోక వృక్షముపైన వుండి సీత భయపడకుండా అమృత వాక్యాలు  వల్లించెదను


ఈ సీతాదేవి నాయొక్క వానర రూపమును, మానవ భాషితమును
వినగానే  రాక్షసుల వల్ల భయపడుతున్న సీత ఇంకా భయ పడును
పిదప ఉత్తమమైన మనస్సుగల విశాలాక్ష్మి యగు సీత నన్ను చూసినను
కామ రూపములొ వచ్చిన రావణుడని భావించి పెద్దగా అరవ గలుగును

 
సీత అరవగానే ఘోర రాక్షసీ గణము నంతయును
వివిధ ఆయుధములు చేత ధరించి గుమ్మిగూడి వచ్చును 
వికృతమైన స్త్రీలు నన్ను నలుమూలల నుండి చుట్టి వేయును 
నన్ను చంపుటకు వారి బలమంత ప్రయోగించి ప్రయత్నం చేయును


అప్పుడు నేను వాళ్లకు దొరకకుండా మహావృక్షం కొమ్మలను పట్టు కొన వలెను 
నేను అతివేగముగా పరుగెత్తి చుండగా చూసి వాళ్లకు భయము ఇంకా కల్గును 
నా రూపమును చూసి రాక్షస స్త్రీలు వికృతమైన అరుపులు అరవ కల్గును
అటుపిమ్మట రాక్షస స్త్రీలు రాక్షస భవణము వద్ద ఉన్న రాక్షసులను అహ్వానించెను


 
ఆ రాక్షసులు గూడా ఉద్వేగముగా శూలములను బాణములను కరవాలములను 
ఇంకా వివిధ ఆయుధములు ధరించి వేగముగా నన్ను మర్దించుటకు వచ్చును 
వాళ్ళందరూ నలుమూలలు చుట్టు ముట్టగా ఆ రాక్షస సైన్యమును సంహరించుచూ నేను
ఈ మహా సముద్రము ఆవలి వడ్డుకు పోజాలను అని మనసులో అను కొనెను 


నన్ను పట్టు కొనినచో సీత యొక్క ప్రయోజనము నెరవేరదు, నేను పట్టు బడెదను 
రాక్షసులు జానకిని హింసించ గలరు, రామ సుగ్రీవుల కార్యము  ప్రమాదములో పడును 
 జానకి రహస్య ప్రదేశములో నివసించు చున్నది, ఇక్కడ నుండి మార్చ వచ్చును 
నేను యుద్దములో  హతమైనను, బందీ అయినను రామకార్యము నేరవేర్చువారు వేరోకరు లేకుండును 


ఆలోచించగా నేను నిహితుడైనచొ మహాదది దాటువాడు కనిపించ కుండును  
నేను వేలకొలది రాక్షసులను సంహరించే సామర్ధ్యమున్న ఆవలి ఒడ్డుకు పోజాలను
యుద్దములో జయాపజయములు అనిశ్చితములు నాకు సంశయము ఇష్టము కాదును
ప్రాజ్నుడగు వాడెవ్వడు అసందఘ్దమైన కార్యమును సంశయుక్తముగా గావించును ?  

అవి వేకియును మనశ్చామ్చల్యము కలవాడునగు దూత మూలమునను 
 సిద్ధియైనకార్యములు కుడా దేశకాలమునకు వ్యతరేకముగా ఉండుటను
సూర్యోదయ మవగానె చీకటి మయముగాను నేను సీతతొ మాటలాడినను 
ఇంత దోషముండును మాటలాడకుండినను ఆమె ప్రాణత్యాగము జరుగును

ఏది లాభమో ఏది నష్టమో నిర్ణ ఇంచు కొన్న కార్యము నందును
వివెకహీనులైన దూతలను నియమించినచో ఆకార్యము విఫలమగును
పండితులు దురభిమానములు గల దూతలు కార్యములను చెడ  కొట్టును 
ఇప్పుడు నేను ఎ విధముగా ప్రవర్తించినచో కార్యము చెడి పోకుండా ఉండును?

నేను ఎట్లు మాట్లాడిన బుద్దికి వ్యాకులత్వము కలుగ కుండా యుండును 
నేను చేసిన సముద్ర లంఘణము వ్యర్ధము కాకుండా ఇక్కడ నేను ఏమి చేయవలెను  
 సీత నా మాటలువిని భయపడకుండా ఉండుటకు ఏవిధముగా మాట్లాడ వలెను
హనుమంతుడు పలువిధాలుగా అలోచించి తను ఏమి చేయవలెనో నిశ్చయించు కొనెను 

సీత మనస్సు అత్యుత్తమ బంధువైన రాముని యందే లగ్నమై యుండెను 
ఉతమ బంధువైన  రామున్ని గూర్చి  కీర్తినచొ ఈమె భయపడ కుండా ఉండును 
ఆత్మవేత్తయును అగు శ్రీ రామునికి సంభందించిన సమస్త వచనములు వినిపించెదను
మధురముగా పలికి ఆమె నన్ను విశ్వసించునట్లుగ ఆమెకు ప్రత్యత్తర మోసంగుదును   

చెట్టుకొమ్మలు మద్య దాగియుండి సీతను 
చూచుచూ మదురాతి మధురముగా వచనములను
వ్యర్ధముకాని అనేక విధములైన మాటలను
హనుమంతుడు సీతాదేవితొ పలుకుట ప్రారంభించెను

శ్రీ సుందర కందమునండు 30 వ స్వర్గ సమాప్తము